శ్రీలు పొంగిన జీవగడ్డ....రాయప్రోలు సుబ్బారావు గారు..

రాయప్రోలు సుబ్బారావు గారు..

శ్రీలు పొంగిన జీవగడ్డయు

శ్రీ లు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరత ఖండము
భక్తి పాడర తమ్ముడా!

వేద శాఖలు వెలసెనిచ్చట
ఆది కావ్యంబలరెనిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదుసమ్మిది చెల్లెలా! విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికెనిచ్చట
విపుల తత్వము విస్తరించిన
విమల తలమిది తమ్ముడా!

పాండవేయుల పదును కత్తుల
మండి మెరిసిన మహిత రణ కధ
పండగల చిక్కని తెలున్గుల
కలిపి పాడవె చెల్లెలా! దేశ గర్వము దీప్తి చెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేశ మరసిన ధీర పురుషుల
తెలిసి పాడర తమ్ముడా!

లోకమంతకు కాక పట్టిన
కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవ పదములు
చేర్చి పాడవె చెల్లెలా!.......

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!