పురుష సూక్తమ్.....
పురుష సూక్తమ్.....
వేదాహమేతం పురుషం మహంమ్ l ఆదిత్యవర్ణం తమసస్తుపారే l
సర్వాణి రూపాణి విచిత్య ధీరః l నామాని కృత్వా ః--భివదన్ యదాస్తే ll
అహం వేద= ప్రపంచ సృష్టి యను మహా యజ్ఞమును
నిర్విరామముగా నెవేర్చుచున్న పరమేశ్వరుని, ఉనికిని
తమ తపశ్శక్తి వలన, తమ దివ్య మనో భూమికలయందు
సాక్షాత్కరించుకొన్న ఋషీశ్వరులందరూ ప్రకటించినారు.
ఏమని......
నేను (మేము) తెలుసుకున్నాను.
ఎవరిని .........
సమస్త లోకములకావల ఉండి, కేవలము తనలోని పావు భాగము
మాత్రము, వ్యక్త పరచిన ఆ భగవంతుడు, చేయుచున్న సృష్టి
కార్య మను మహా యజ్ఞమునుండి, ప్రపంచమును ప్రభవిపచేసి
తన సృష్టిలోని సమస్త, చరాచర పదార్ధములకు,నామకరణము
చేసియట్టి పరమేశ్వరుని తెలుసుకున్నాను (ము)
ఆ భగవంతుడు, క్రియాశీలుడై ఉంటూ, మహిమాన్వితుడై,
తాను సృజించిన సూర్యునివలె ప్రకాశించేవాడై, అంధకారమునకు
ఆవల ఉన్నవాడై (తమస్సు అనగా అజ్ఞానము, ఋషుల అభిప్రా
యము) ధ్యానము, తపస్సులచేత తమ అంధకారము ను పార
ద్రోలినవారైన ఋషులు, పరమేశ్వరుని తెలుసుకున్నామని
ప్రకటించిరి.
ఓం శాంతి శాంతి శాతిః .....
(నందిరాజు పుర్ణయ్య సిద్ధాంతి శర్మ గారి వివరణ .)

Comments
Post a Comment