మనుజుడైపుట్టి మనుజుని సేవించి అనుదినమును దు:ఖమందనేలా

మనుజుడైపుట్టి మనుజుని సేవించి
అనుదినమును దు:ఖమందనేలా

జుట్టెడుగడుపుకై చోరని చోట్లు చొచ్చి
పట్టెడుగూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి
వట్టిలంపటము వదలనేరడు గాన

అందరిలో పుట్టి అందరిలోపెరిగి
అందరి రూపములటుదానై
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరానిపదమందె నటుగాన.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!