ఆకాశంలో ఆశల హరివిల్లూ..

స్వర్ణకమలం విరిసి పాతికేళ్ళు అయినా సందర్బంగా ...ఈ పాట విందాం...

ఆ..ఆ..ఆఆఆ..ఆ

ఆకాశంలో ఆశల హరివిల్లూ..
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైన ఆ లోకం అందుకోనా..
ఆదమరచి కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లూ..
ఆనందాలే పూసిన పొదరిల్లూ

మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా..
వయ్యారివాన జల్లైదిగిరానా..
సంద్రంలొ పొంగుతున్న అలనైపోనా..
సందెల్లో రంగులెన్నో చిలికేనా..
పిల్లగాలే పల్లకీగా..దిక్కులన్నీ చుట్టీ రానా..
నా కోసం.. నవరాగాలే..నాట్యమాడెనుగా..

ఆకాశంలో ఆశల హరివిల్లూ..
ఆనందాలే పూసిన పొదరిల్లూ

స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలూరే సోయగానా..చందమామా మందిరానా..
నా కోసం..సురభోగాలే..వేచి నిలిచెనుగా...

ఆకాశంలో ఆశల హరివిల్లూ..
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైన ఆ లోకం అందుకోనా..
ఆదమరచి కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లూ..
ఆనందాలే పూసిన పొదరిల్లూ
http://www.youtube.com/watch?v=R_5sk6MJNDQ

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!