Posts

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0901) (శ్రీ శేషప్ప కవి)

Image
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0901) (శ్రీ శేషప్ప కవి) సీ|| నీలమేఘశ్యామ ! నీవె తండ్రివి మాకు, కమలవాసిని మమ్ముఁగన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్, నీ కటాక్షము మా కనేకథనము, నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు. నీ సహాయము మాకు నిత్యసుఖము, నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య, నీ పద ధ్యానంబు నిత్య జపము . తే|| తోయజాతాక్ష ! నీ పాద తులసిదళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత ! భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి రేడియో స్టేషన్ అనుబంధం!

Image
ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి రేడియో స్టేషన్ అనుబంధం! విజయవాడ రేడియో స్టేషన్ లో ఏడున్నరఏళ్ళు ప్రయోక్తగ పని చేశారు’’ . ‘’.రేడియో స్టేషన్ ను ఒక యూని వర్సిటి గా మార్చారు పింగళి ‘’అన్నారు శ్రీ వాత్సవ .శంకరన్ అనే కొత్త స్టేషన్ డైరెక్టర్ వచ్చి చేరినప్పుడు  పాత ఆయన పింగళి ని పరిచయం చేస్తూ ‘’వీరు సంస్కృతిక కార్య క్రమాలను నిర్వహిస్తున్నారు ‘’అని చెబితే ‘’  వంకరన్ ‘’’’I am number one enemy of sanskrtit ‘’అన్నాడు . వెంటనే పింగళి ‘’sanskrit loses nothing on that account ‘’అని ఎదురు దెబ్బ కొట్టారు విజయ వాడ నుంచి హైదరాబాద్ కు మారుస్తామని చెబితే ‘’నేను ఉద్యోగం నుంచి తప్పుకొంటాను ‘’అని కరాఖండీ గా చెబితే ఆ ప్రయత్నం మానుకొన్నారు పై వాళ్ళు . రేడియో లో p.p.l.v.ప్రసాద్ అనే యువకవి అష్టావధాని తో రేడియో లో మొదటి అష్టావధానాన్ని చేయించిన ఘనత పింగళి ది  ఈ ప్రసాద్ యే తర్వాత ప్రసాద రాయ కులపతి అయ్యారు  ఇప్పుడు కుర్తాలం పీఠాది పతి గా ఉన్నారు . అప్పుడు విజయ వాడ హైదరాబాద్ లకు పింగళి వారే ప్రయోక్త ఆ తర్వాతదేవుల పల్లి కృష్ణ శాస్త్రి హైదరాబాద్ కు  జాషువా గారు మద్రా...

అరవ పిల్ల !

Image
అరవ పిల్ల ! శ్రీనాధుడికి అరవ పిల్లలు అంటే, యెంత ఇష్టమో... హాస్య ధోరణిలో చెప్పిన ఈ చాటువు చూడండి...  ఇదిగో, మీరు ఏమైనా తిట్టాలన్నా, ఇరికించాలన్నా ... శ్రీనాధుడినే పట్టుకోవాలి. చదివే ముందు అదే నియమం. . మేత కరిపిల్ల; రణమున మేకపిల్ల  పారుబోతు తనమున పందిపిల్ల  ఎల్లపనులను చెరుపంగ పిల్లిపిల్ల  అందమున కోతిపిల్ల , ఈ అరవ పిల్ల . అరవం అంటే కరవం అనే కదా మీ భావన. సంగీత త్రిముర్తులు మా ప్రాంతం వారే, వ్యాకరణం రాసిన పరవస్తు చిన్నయసురి మా ప్రాతం , తెలుగు పేపర్లన్ని మా ప్రాంతం,తెలుగు సినిమాలన్ని మా ప్రాంతం , ఆఖరికి మీరు వుంటున్న ఆంధ్ర కూడా మా ప్రాంతంలో అత్మాహుతి ఫలితమే. ఇంతటితో ఆగుతానా ******************** ఆసియాఖండం లో హైయె పేయ్డ్ స్టార్ సూపర్ స్టార్ రజనికాంత్, ఆస్కార్ అవార్డ్ ఏ ఆర్ రెహమాన్ మా ప్రాంతం ఎన్ని సున్నాలో గుర్తుకు రావటం లేదు అన్ని కోట్లు 2G స్కాము మా ప్రాంతం . ఇక కరిపిల్ల --వాణిశ్రీ ,రాజశ్రీ ,రోజా,శారద వీరందరు కరి పిల్లలే , వీరి అందం మైనపు బొమ్మలకుందా? . ఇక కరి పిల్లాడు పెద్ద లిస్టే ఇస్తా! రజనికాంత్ ,విజయకా...

మహాకామేశ్వరుడు !

Image
మహాకామేశ్వరుడు ! కాముడు కాలిపోయాక కోరికలెక్కడంటాయి?  . "శివ కామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభా నమః " . . (మంత్రం . . అర్థం) . కాముని దహించిన సదాశివుడు మహాకామేశ్వరుడై నాడు  చిత్ర మైన నామం  పార్వతి తపించి తపించి ఘోరంగా తపస్సు చేసి కాముడు కాలి బూడిదైన తరవాత తపఃఫలంగా . శివుని వివాహం ధర్మ బద్ధంగా చేసుకుంది . పార్వతి దేవి ముఖ సౌందర్యం వర్ణనా తీతం కాముడు కాలిపోయాక కోరికలెక్కడంటాయి? . అంటే అనంగుడైన మన్మధుని భార్య రతీదేవి మాత్రమే దర్శిస్తుంది  వేల వేల రతీమన్మధుల వోడిపోయే అందం శివ పార్వతులది . మహాకామేశ్వర మహాకామేశ్వరి ఎలా అయ్యారంటే . . . మన్మధుడు కాలి బూడిదై తే  ఆ బూది శివుని శరీరం మొత్తం అలుముకున్నాడు విశ్వం మొత్తం నిండివున్న శివుడు దేహమేలేని కామునికి దేహమైనిలచి  మహాకామంతో వెేల వేల రతీదేవుల అందాన్ని తలదన్నె  అందాలరాశి యైన శివాని శివుని వొడిచేరి మహాకామేశ్వరిగా విశ్వసృష్టి చేసింది  శివుని అర్థదేహం తనలోకలుపుకుని మహాకామేశ్వరి అయ్యింది  ప్రతిజీవిలో పరమాత్మ వుంటాడు అన్నది నిజమైతే ఆ జీవుల కామం పరమాత్మ స్వరూప మే . శివాశివా...

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0801) (శ్రీ శేషప్ప కవి)

Image
                       శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ! శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0801) (శ్రీ శేషప్ప కవి) . సీ|| తనువులోఁ బ్రాణముల్ తరలిపోయెడివేళ నీ స్వరూపమును ధ్యానించునతఁడు నిమిషమాత్రములోన నిన్నుఁ జేరునుగాని, యమునిచేతికిఁ జిక్కిశ్రమలఁబడఁడు; పరమసంతోషాన భజనఁ జేసెడి వాని పుణ్య మేమనవచ్చు భోగిశయన ! మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని నరక మెక్కడిదయ్య నళిననేత్ర ! . తే|| కమలనాభుని మహిమలు కానలేని తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

తొలకరి .. పింగళి కాటూరి కవులు !

Image
                                       తొలకరి .. తొలకరి .. పింగళి కాటూరి కవులు ! . దినకరుడు శాంతుడై తోచె దినములింత కురుచలయ్యెను జలిగాలి చురుకు హెచ్చె బొలములన్ రేల గ్రుడ్డి వెన్నెలల లోన గుప్పలన్ నూర్చు కాపులు గొంతులెత్తి పదములన్ బాడదొడగిరి; పచ్చపూల జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి మిరప పండ్లకు గుంకుమ మెరుపు దార్చి బంతిపూవుల మొగములల్లంత విచ్చి మన గృహమ్ముల ధాన్య సంపదల నిల్పి సరస మధురమ్ము పుష్యమాసమ్ము వచ్చె!

ఆచార్య పింగళి లక్ష్మీ కాంతము గారు ! (అప్పటి చదువులు)

Image
ఆచార్య పింగళి లక్ష్మీ కాంతము గారు ! (అప్పటి చదువులు) లక్ష్మీకాంతం గారి తండ్రి పింగళి వెంకట నరసయ్య గారు ఆచార్య పింగళి లక్ష్మీ కాంతముకృష్ణా జిల్లా చల్లపల్లి ఎస్టేట్ లో చిన్న ఉద్యోగి గా ఉండేవారు చిట్టూర్పు లో కాపురం కొద్దిగా పొలం వ్యవసాయం ఉండేవి  ఊరిలో మంచి పలుకుబడి గల వ్యక్తీ . బందరు దగ్గర అర్తమూరు లో మోచర్ల మృత్యుంజయుడు గారి చెల్లెలును వివాహమాడారు .లక్ష్మీ కాంతం గారు ఈ తాలిదంద్రులకుమాతామహుల ఇంట్లో 10-1-1994లో అర్తమూరు లో జన్మించారు .చిట్టూర్పు లో పెరిగారు . తండ్రిగారు అక్షరాభ్యాసం చేశారు .వీఎది బడిలో చదువుకొన్నారు .తాటాకుల పుస్తకం కుట్టి ,దాని మీద గంటం తో సమతీ శతకం లోని ఒక పద్యాన్ని గురువు గారు రాసి ఇచ్చి మూడు సార్లు అని పించి మర్నాడు ఒప్ప జెప్పుకోనేవారు . ఈయనకు ఆనేదికాడు రోజుకు పది పద్యాలైనా కావాలన్నంత ఆకలి .కాని గరువు మరీ బతిమిలాడితే రెండు పద్యాలు రాసేవారంతే . రెండు నెలలో సుమతీ శతకం పూర్తీ చేశారు . ఒక్క ఏడాదిలో ఎనిమిది శతకాలు బట్టీ పట్టేశారు .ఆ రోజుల్లో పద్యానికి అర్ధం చెప్పేవారు కాదు .పిల్లలు అడిగే వారూ కాదు . అప్పుడు చదువు అంటే భాష రావతామే స్వచ్చంగా ,స్...