శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0801) (శ్రీ శేషప్ప కవి)

                       శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0801)

(శ్రీ శేషప్ప కవి)

.

సీ|| తనువులోఁ బ్రాణముల్ తరలిపోయెడివేళ

నీ స్వరూపమును ధ్యానించునతఁడు

నిమిషమాత్రములోన నిన్నుఁ జేరునుగాని,

యమునిచేతికిఁ జిక్కిశ్రమలఁబడఁడు;

పరమసంతోషాన భజనఁ జేసెడి వాని

పుణ్య మేమనవచ్చు భోగిశయన !

మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని

నరక మెక్కడిదయ్య నళిననేత్ర !

.

తే|| కమలనాభుని మహిమలు కానలేని

తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.