శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1501) (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1501)

(శ్రీ శేషప్ప కవి)

.

సీ|| 

నీమీఁద కీర్తనల్ నిత్యగానముఁజేసి

రమ్యమొందింప నారదుఁడ గాను;

సావధానముగ నీ చరణపంకజసేవ

సలిపి మెప్పింపంగ శబరిఁగాను;

బాల్యమప్పటినుండి భక్తి నీయందునఁ

గలుగను బ్రహ్లాద ఘనుఁడఁగాను;

ఘనముగా నీమీఁద గ్రంధముల్ కల్పించి

వినుతిసేయను వ్యాస మునిని గాను;

తే||

సాధువును, మూర్ఖమతి, మనుష్యాధముఁడను;

హీనుఁడను, జుమ్మి; నీవు నన్నేలు కొనుము

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!