శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1801) (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!


శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1801)

(శ్రీ శేషప్ప కవి)

సీ|| 

అధిక విద్యావంతుల ప్రయోజకులైరి,

పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి,

సత్యవంతులమాట జనవిరోధంబాయె,

వదరుపోతులమాట వాసికెక్కె,

ధర్మవాసనపరుల్ దారిద్ర్య మొందిరి,

పరమలోభులు ధన ప్రాప్తులైరి,

పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి,

దుష్ట మానవులు వర్ధిష్టులైరి,

తే||

పక్షివాహన! మావంటి భిక్షుకులకు

శక్తిలేదాయె, నిఁక నీవె చాటు మాకు,

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.