శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0501) (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0501)

(శ్రీ శేషప్ప కవి)

.

సీ|| మాన్యంబులీయ సమర్ధుఁ డొక్కఁడు లేఁడు;

మాన్యముల్ చెఱుప సమర్ధులంత;

యెండిన యూళ్ళ గోడెరిఁగింపఁ డెవ్వఁడుఁ;

బండిన యూళ్ళకుఁ బ్రభువు లంత;

యితఁడు పేద యటంచు నెఱిఁగింపఁడెవ్వఁడు;

గలవారి సిరులెన్నఁగలరు చాలఁ;

దన యాలి చేష్టలఁ దప్పెన్నఁ డెవ్వఁడుఁ

బెఱకాంత తప్పెన్నఁ బెద్దలంత;

.

తే|| యిట్టి దుష్టుల కథికార మిచ్చినట్టి

ప్రభువు తప్పులటంచును బలుకవలెను;

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !