మరొక ఆదిశంకరులవారు అవతారమెత్తాలి !

మరొక ఆదిశంకరులవారు అవతారమెత్తాలి !

శ్రీ ఆదిశంకరాచార్యులవారు సాక్షాత్తూ పరమశివుని అవతారమని భావిస్తాము.

భారతావనిలో బౌద్ధం ప్రబలంగా వ్యాపిస్తున్న కాలం లో, 

ఆది శంకరులవారు తమ జన్మస్థానమైన కలాడి లో కూర్చోని తమ అద్వైత సిద్ధాంత ప్రవచనాలు చేయలేదు. 

పాదచారియై బౌద్ధాన్ని "ప్రచ్చన్న పాషండం" గా ఖండిస్తూ,

దేశం నలుమూలలా శంకర మఠాలు స్థాపించి ధర్మ ప్రచారం చేశారు. హిందూమత పరిరక్షణ చేశారు.

ఎక్కడి కేరళలో కలైడి, ఎక్కడి హిమాలయాలు!!!

అదీ 1200 యేండ్ల క్రిందట!!

హిందూమత పునరుద్ధరణకు బద్ధకంకణులై శ్రమించగల

పరివ్రాజక స్వాములు--మరొక ఆదిశంకరులు---అవతరించాల్సిన సమయం వచ్చింది.

హైందవం జనసామాన్యానికి దూరమై ఎవరో కొంతమంది 

ఛాందస ఆచారవ్యవహారాలకు బందీయై, పరిమితమై అంతరించిపోయే ప్రమాదం ప్రస్ఫుటంగా కనపడుతున్నది. పవిత్రహైందవ శంఖనినాదం వూరువూరులా, వాడవాడలా 

ప్రతి ప్రాంగణంలోనూ మారుమ్రోగింపవలసిన తరుణం వచ్చింది. రాజకీయ దుర్గంధానికీ, ఛాందసానికీ దూరంగా హైందవుడైన ప్రతి పురుషుడూ, 

ప్రతి స్త్రీ కులాలకు అతీతంగా హైందవం నాది, మనది అని గర్వించగల తరుణం సాకారం చేయగల ధర్మప్రచారకులు మరొక ఆది శంకరులు ఈ పవిత్రావనిలో ఉద్భవించాలి,అవతరించాలి. యదాయదాహి ధర్మస్య, గ్లానిర్భవతి భారత, ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి అన్న ప్రతిజ్ఞ నెరవేరాలి. 

ధర్మోరక్షతి రక్షితః.

.


.( -@ Vunnava Nageswara Rao.గారి కి కృతజ్ఞతల తో )

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!