తొలకరి .. పింగళి కాటూరి కవులు !

                                       తొలకరి ..

తొలకరి .. పింగళి కాటూరి కవులు !

.

దినకరుడు శాంతుడై తోచె దినములింత

కురుచలయ్యెను జలిగాలి చురుకు హెచ్చె

బొలములన్ రేల గ్రుడ్డి వెన్నెలల లోన

గుప్పలన్ నూర్చు కాపులు గొంతులెత్తి

పదములన్ బాడదొడగిరి; పచ్చపూల

జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి

మిరప పండ్లకు గుంకుమ మెరుపు దార్చి

బంతిపూవుల మొగములల్లంత విచ్చి

మన గృహమ్ముల ధాన్య సంపదల నిల్పి

సరస మధురమ్ము పుష్యమాసమ్ము వచ్చె!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!