శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1401) (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1401)

(శ్రీ శేషప్ప కవి)

సీ|| 

ఇభరాజవరద ! నిన్నెంత పిల్చిన గాని

మాఱు పల్కవదేమి మౌనితనమొ,

మునిజనార్చిత ! నిన్ను మ్రొక్కి వేడినఁగాని

కనుల!జూచి వదేమి గడుసుదనమొ?

చాల దైన్యమునొంది చాటు జొచ్చినఁగాని

భాగ్యమీయ వదేమి ప్రౌఢతనమొ?

స్ధిరముగా నీపాద సేవఁ జేసెదనన్న

దొరకఁజాల వదేమి ధూర్తతనమొ?

తే||

మోక్షదాయక! యిటువంటి మూర్ఖజనునిఁ

గష్టపెట్టిన నీకేమి కడుపునిండు ?

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!