ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర్వ సేవితాయై నమః . . .

ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర్వ సేవితాయై నమః . .


ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర్వ సేవితాయై నమః . . . . . . మంత్రం . . అర్థం . .

అమ్మ వారు హిమవంతుని పుత్రిక గా ఆవిర్భవించి శివుని పతిగా పొంద టం కోసం

పంచాగ్నుల మధ్యలో గ్రీష్మంలోనూ .

హేమంతంలో చల్లని నీటిలో కంఠం వరకు మునిగి వర్షాకాలంలో 

నిర్జనాటవిలో ఆకులు . నీటిని మాత్రమే స్వీకరిస్తూ తపస్సు చేస్తూ 

శివ సాక్షాత్కారం కాలేదని . బాధాతప్త హృదయం తో 

గాలిని మాత్రమే స్వీకరిస్తూ తపస్సంకల్పానికి సిధ్ధ పడగా 

హిమవంతుడు పెద్దలు మునులూ అంత ఘోర తపస్సు వద్దు

అని వారించారు హెచ్చరించారు బతిమలాడారు బుజ్జగించారు ప్రార్థించారు వేడుకున్నారు అనునయించారు 

పార్వతి వొప్పుకోలేదు అంగీకరించలేదు . సమ్మతించలేదు .

ఉహు . . . ఉహు . ఉహూ . అంటూ తనఅసమ్మతి తెలియ చేస్తూ నే తపస్సు కి ఉద్యుక్తురాలవగా . . . అందరూ . . పార్వతి ని . 

ఉమా ఉమా అంటూ ముక్త కంఠంతో పిలిచారు . 

కార్యదీక్షకు కోరికలు తీరుటకు ఏకాగ్రతకూ అర్థం . పరమార్ధం . 

ఉమా నామధేయం .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!