శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1601) (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1601)

(శ్రీ శేషప్ప కవి)

.

సీ||

అతిశయంబుగఁ గల్లలాడ నేర్చితిఁ గాని

పాటిగా సత్యముల్ బలుకనేర;

సత్కార్య విఘ్నముల్ సలుపనేర్చితిఁగాని

యిష్ట మొందఁగ నిర్వహింపనేర;

నొకరిసొమ్ముకు దోసిలొగ్గనేర్చితిఁగాని

చెలువుగా ధర్మంబు సేయనేర;

ధనము లియ్యంగ వద్దనఁగ నేర్చితిఁగాని

శీఘ్రమిచ్చెడునట్లు చెప్పనేర;

తే||

పంకజాతాక్ష ! నే నతి పాతకుఁడను

దప్పులన్నియు క్షమియింపఁ దండ్రివీవె;

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!