శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1701) (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1701)

(శ్రీ శేషప్ప కవి)

.

సీ||

ఉర్విలో నాయుష్యమున్న పర్యంత్మంబు

మాయ సంసారంబు మరగి, నరుఁడు

సకల పాపములైన సంగ్రహించునుగాని

నిన్ను జేరెడి యుక్తి నేర్వలేఁడు,

తుదకుఁ గాలునియొద్ద దూత లిద్దఱువచ్చి

గుంజుక చనివారు గ్రుద్దుచుండ,

హింస కోర్వఁగలేక యేడ్చి గంతులు వేసి

దిక్కులేదని నాల్గు దిశలు చూడఁ,

తే||

దన్ను విడిపింప వచ్చెడి ధన్యుఁడెవడు?

ముందె నీ దాసుఁడైయున్న ముక్తిగలుగు; 

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!