శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2201) (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2201)

(శ్రీ శేషప్ప కవి)

-సీ||

కర్ణయుగ్మమున నీ కథలు సోఁకినఁ జాలు

పెద్ద పోగుల జోళ్లు పెట్టినట్లు

చేతు లెత్తుచుఁ ౠజ సేయఁగల్గినఁ జాలు

తోరంపుఁ గడియాలు తొడిగినట్లు,

మొనసి మస్తకముతో మ్రొక్కఁగల్గినఁ జాలు

చెలువమైన తురాయి చెక్కినట్లు,

గళము నొవ్వఁగఁ నామస్మరణ గల్గినఁ జాలు,

వింతగాఁ గంఠీలు వేసినట్లు,

తే||

పూని నినుఁ గొల్చుటే సర్వ భూషణంబు,

లితర భూషణముల నిచ్చగింపనేల?

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!