శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!








శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0301)

(శ్రీ శేషప్ప కవి)

.

సీ|| పసరంబు పంజైనఁ బసులకాపరితప్పు,

ప్రజలు దుర్జనులైనఁ బ్రభుని తప్పు,

భార్య గయ్యాళైనఁ బ్రాణనాధుని తప్పు,

తనయుఁడు దుడుకైన దండ్రి తప్పు,

సైన్యంబు చెదరిన సైన్యనాధుని తప్పు,

కూతుఁరు చెడుగైన మాతతప్పు,

అశ్వఁబు దురుసైన నారోహకుని తప్పు,

దంతి మదించ మావంతు తప్పు,

.

తే|| ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చవచ్చి

నటుల మెలఁగుదు రిప్పు డీ యవని జనులు; 

.భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!