సీతాయాః చరితం మహత్”

సీతాయాః చరితం మహత్” 

.

 రామాయణం రచిస్తూ “సీతాయాః చరితం మహత్” 

అని చెప్పినట్లుగా విన్నాను..

.

రామాయణం ను “రామస్య అయనం” గానూ, 

“రామాయాః అయనం” గానూ కూడా చెప్పవచ్చు. 

ఆ విధంగా చూస్తే, రామాయణమంతా

 “సీతాయాః చరితం మహత్” అనటమే ఉచితమేమో.

.

ఇక మరొకటి, ఆంజనేయునితో మాట్లాడటం అంటే సామాన్యం కాదు.

 రాముడే స్వయంగా లక్ష్మణుని సావధానపరచినట్లుగా ఉంటుంది – “

నా ఋగ్వేద వినీతస్య…” శ్లోకం. 

అంతటి హనుమతో సమానంగా మాట్లాడింది సుందరకాండలో. 

హనుమ నొచ్చుకునే సందర్భాన్ని గమనించి, 

అతన్ని చక్కటి మాటలతో సమాధానపరచింది కూడా – 

అదీ ఆవిడ దాదాపుగా ఒక సంవత్సర కాలంగా బందీగా ఉండి, 

దుఃఖంలో మునిగి ఉండి. గొప్ప మానసిక శాస్త్రవేత్త.

.

ఇక ధైర్యం – రావణునిచే అపహరింపబడి, 

వాడి రాజ్యంలో, వాడి వారి ముందు, వాడిని మొహం మీద 

“శునక సమాన ప్రవర్తన” కలవాడని గుర్తు చేస్తుంది. ఆ

 రావణ సంవాదమే అమ్మ గొప్పదనానికి పరాకాష్ఠ. 

“Kidnap” కి గురైన వాళ్ళు మగవాళ్ళైనా – ఎంతమంది అలా మాట్లాడగలరు?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!