రామ చిలుక!

రామ చిలుక!

(దేశి సాహిత్యము.... జానపద గేయములు.. ఎల్లోరా)

.

చిలుక చిలుక రామ చిలుక

పలక నంటుందీ

అత్త తెచ్చిన కొత్తకోక

కట్టనంటుంది

మామ తెచ్చిన సన్న బియ్యం

దంచ నంటుంది

అవ్వ తెచ్చిన ఆది రసం

తినా నంటుంది

మొగుడు తెచ్చిన మల్లెపూలు

ముడవ నంటుంది

కటారి కోకమీద

కన్ను వేసిందీ.

మామ కొడుకుమీద

మనసు ఉంచిందీ.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!