శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0401)

(శ్రీ శేషప్ప కవి)

.

సీ|| కోఁతికి జలతారు కుళ్ళాయి యేటికి?

విరజాజి పూదండ విధవకేల?

ముక్కిడి తొత్తుకు ముత్తెంపు నత్తేల?

నద్దమేమిటికి జాత్యంధునకును?

మాచకమ్మకు నేల మౌక్తిక హారముల్?

క్రూరచిత్తునకు సద్గోష్ఠు లేల?

ఱంకుఁబోతుకు నేల రమ్యంపు నిష్ఠలు?

వావి యేటికి దుష్ట వర్తనునకు?

.

తే|| మాట నిలకడ సుంకరి మోటు కేల?

చెవిటివానికి సత్కథా శ్రవణమేల? 

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!