శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2401) (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2401)

(శ్రీ శేషప్ప కవి)

-సీ||

గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు?

మర్కటంబున కేల మలయజంబు?

శార్దూలమున కేల శర్కరాపూపంబు?

సూకరంబులకేల చూతఫలము?

మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి?

గుడ్లగూబల కేల కుండలములు?

మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్?

బకసంతతికి నేల పంజరంబు?

తే|| 

ద్రోహచింతనఁ జేసెడి దుర్జనులకు

మధురమైనట్టి నీ నామ మంత్రమేల? 

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.