Posts

Showing posts from February, 2014

రుక్మిణి అపహరణ....

Image
మాసరివాఁడవా మాపాపఁగొనిపోవ నేపాటి గలవాఁడ వేది వంశ మెందు జన్మించితి వెక్కడఁ బెరిఁగితి వెయ్యది నడవడి యెవ్వఁడెఱుఁగు మానహీనుఁడవీవు మర్యాదలెఱుఁగవు మాయఁగైకొనికాని మలయరావు నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు వసుధేశుఁడవు గావు వావిలేదు కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు విడువు విడువవేని విలయకాల శిఖిశిఖాసమానశితశిలీముఖముల గర్వమెల్లఁగొందుఁ గలహమందు

సాహితీ వనం - వర ప్రసాద్...

Image
సాహితీ వనం - వర ప్రసాద్... స్వాయంభువమనువు చరిత్రమును విన్నతర్వాత, తర్వాతి మనువు ఎవరు? అతని కథ ఏమిటో వివరించండి పుణ్యాత్ములారా! అని జైమిని మహర్షి అడిగాడు. పక్షులు వివరించడం ప్రారంభించాయి, అల్లసానివారి అల్లికకు అనుగుణముగా, ఈ విధముగా... వరణా ద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాం బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయ రుఙ్మండలీ హరిణంబై యరుణాస్పదం బనఁగ నార్యావర్త దేశంబునన్ బురమొప్పున్ మహికంఠహార తరళస్ఫూర్తిన్ విడంబింపుచున్ ‘వరణా’నదీ తీరంలో, ఆర్యావర్తము అని పిలువబడే ప్రాంతములో, ఆకాశాన్ని అంటుకునేట్లున్న భవన గోపురములను కలిగినది (వప్రస్థలీ చుంబితాంబరమై) తన పాలరాతి భవనముల తెల్లని కాంతులతో చంద్రుడి లోని జింకను కూడా తెల్లగా మెరిపించేది (సౌధసుధాప్రభాధవళిత ప్రాలేయ రుఙ్మండలీహరిణంబై) భూదేవి కంఠములో తళ తళలాడే హారములాంటి పట్టణము, అరుణాస్పదము అనే పట్టణము ఒకటి ఉండేది. వరణ – అసి అనే రెండు నదుల మధ్యన ఉన్న పవిత్ర ప్రాచీన నగరము వారణాసి (కాశి). అరుణాస్పదము అనే పట్టణం వరణ నదీ తీరములో ఉంది, అంటే దాదాపు కాశీలో సగము అనేంత పవిత్రత ఉన్న పట్టణము అన్నమాట! అక్కడ విశాలాక్షీ వరుడు, ఇక్కడ విప్రవరుడు ఉన్నార

గజ్జెలు ఘల్లనిమ్రోయఁగ

Image
పోతనామాత్యుడు..భాగవతం... గజ్జెలు ఘల్లనిమ్రోయఁగ నజ్జలు ద్రొక్కుటలుమాని యతిజవమున యో షిజ్జనములు నగఁ దల్లియుఁ బజ్జంజనుదేర నతఁడు పరువిడెనధిపా స్తంభాదికంబులు దనకు నడ్డంబైన నిట్టట్టుచని పట్టనీనివాని నీతప్పు సైరింపుమింక దొంగిలఁబోవ నేనని మునుముట్ట నేడ్చువానిఁ గాటుక నెఱయంగఁ గన్నులునులుముచు వెడలుకన్నీటితో వెగచువాని నేదెస వచ్చునో యిదియని పలుమాఱు సురుఁగుచుఁ గ్రేఁగంటఁ జూచువాని గుడఁబాఱి పట్టుకొని వెఱపించుచుఁ జిన్నివెన్నదొంగ చిక్కెననుచు నలిగి కొట్టఁజేతులాడక పూఁబోణి కరుణతోడ బాలుఁగట్టఁ దలఁచి వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా యెన్నఁడును వెన్నఁగానరఁటకదా చోరత్వం బించుకయును నేరరట ధరిత్రినిట్టి నియతులు గలరే పట్టాసపడక నిన్నుం బట్టెదమని చలముగొనిన బట్టుట బెట్టే పట్టువడవండ్రు పట్టీ పట్టుకొనన్ నాకుఁగాక పరులకు వశమే ఆలలన గట్టె ఱోలన్ లీలన్ నవనీతచౌర్యలీలుం బ్రియవా గ్జాలున్ బరివిస్మిత గో పాలున్ ముక్తాలలామఫాలున్ బాలున్

శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్దులారగించుట.

Image
శ్రీమద్భాగవతం లోని దశమస్కందంలో పోతనగారి పద్యం. శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్దులారగించుట. సీ. మాటిమాటికి వ్రేలుమడచి యూరించుచు నూరుగాయలు నుచుండునోక్క  డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి “చూడు లే” దని నోరు సూపు నొక్క  డేగు రార్గుర చల్దు లెలిమి బన్నిద మాది కూర్కొని కూర్కొని కుడుచు నొక్క  డిన్ని యుండగ బంచి యిడుట నెచ్చలితన మనుచు బంతెనగుండు లాడు నొకడు ఆ. కృష్ణు జూడు మనుచు గికురించి పలు మ్రోల, మేలి భక్ష్యరాశి మెసగు నొకడు నవ్వు నొకడు, సఖుల నవ్వించు నొక్కడు, ముచ్చటాడు నొకడు, మురియునొకడు.  భావం: వ్రేళ్ళమధ్యలో ఊరుగాయ ముక్కలు ఇరికించుకొని మాటి మాటికి ప్రక్కవాడిని ఊరిస్తూ తింటున్నా డొక గోపబాలుడు. మరొకడు ప్రక్కవాని కంచంలోనిది గభాలున లాక్కొని మ్రింగివేసి, వాడు చూడవచ్చేసరికి “ఏదీ ఏమీ లేదే” అని తన నోరు చూపించాడు. మరొకడు పందెం వేసి, అయిదారుమంది తినే చల్దిని నోట కూరుకొని కూరుకొని తింటున్నాడు.”ఒరే ఇన్ని పదార్ధాలున్నాయి, స్నేహమంటే ఒకరిదొకరికి పంచి ఇవ్వాలట్రా !” అంటూ ఒక్కక్కరి కంచంలోనిది ఒక్కక్కటి తీసుకుంటూ ‘బంతెన గుండ్లు’ అనే ఆట ఆడుతున్నాడు మరొకడు. “ఒరే కృష్ణుడు ఎలా నవ్వు

నా బృందావనం

Image
నా బృందావనం 'అచ్చంగా తెలుగం'టూ స్వచ్చంగా తెలుగంటూ ఇంటింట తెలుగంటూ ఇచ్ఛంతా తెలుగంటూ తెలుగు సంస్కృతి .. తెలుగు భాష .. భావజాలంలో తేలియాడే ముఖపుస్తక సమూహం నాది. నా 'కోట' లో ' జాజి' సువాసనల ఆరాధనలు ' అనంతకృష్ణయ్య' ఆహ్వానాలు తెగువ తెలుగు లో మగువ 'పద్మినీ' పంచ్ కహానీలు వయసు మరచిన 'వెంకటప్పన్న' సరదా విట్టుల సరసాలు 'భండారు' బయటెట్టె బండారాలు ' కృష్ణు'ని మరచిన 'రాధ'మ్మ రామకథలు ' కొంపెల్ల రామయ్య ' కొసరి వడ్డించె పద్యాల 'ప్రసాదా'లు 'యనమండ్ర శీనయ్య' కల(ం) 'గీతా'విన్యాసాల కుసుమ పరాగాలు నా తోటలో.. 'మంజ'మ్మ మెచ్చుకోలులు 'విసురజ' విసిరే చురకత్తులు 'సిరు'లొలికించే 'శ్రీదేవి' చిట్టిపద్యాలు ' సిరి వడ్డే' విడిచే పొట్టి కవితల కుబుసాలు 'గోటేటి వెంకన్న' వింగ్లీషు కబుర్లు గాయత్రి 'కళ్యాణ్' కొంటె కామెంట్లు 'చెరుకు' వారి తియ్యని పురాణ ఇతిహాసాలు 'పాలమూరు

అర్ధనారీశ్వర స్తోత్రం

Image
  అర్ధనారీశ్వర స్తోత్రం చాంపేయగౌరార్ధశరీరకాయై - కర్పూరగౌరార్ధశరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ - నమః శివాయై చ నమః శివాయ || ౧ || కస్తూరికాకుంకుమచర్చితాయై - చితారజఃపుఞ్జ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ - నమః శివాయై చ నమః శివాయ || ౨ || ఝణత్క్వణత్కంకణనూపురాయై - పాదాబ్జరాజత్ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ - నమః శివాయై చ నమః శివాయ || ౩ || విశాలనీలోత్పలలోచనాయై - వికాసిపంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ - నమః శివాయై చ నమః శివాయ || ౪ || మందారమాలాకలితాలకాయై - కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ - నమః శివాయై చ నమః శివాయ || ౫ || అంభోధరశ్యామలకున్తలాయై - తటిత్ప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ - నమః శివాయై చ నమః శివాయ || ౬ || ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై - సమస్తసంహారకతాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే - నమః శివాయై చ నమః శివాయ || ౭ || ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై - స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ - నమః శివాయై చ నమః శివాయ || ౮ || ఏతత్పఠేదష్టకమిష్టదం యో - భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం -

నమకం -

Image
నమకం - ఆరవ అనువాకం మూడవ మంత్రము (తెలుగులో ప్రతిపదార్థ విశేషాలు )(27-02-2014) నమోమధ్యమాయచాపగల్భాయచ. नमो मध्यमाय चापगल्भाय च । నమోమధ్యమాయచాపగల్భాయచ మధ్యమాయ= మధ్యమ వయస్సులో అనగా యౌవన వంతుని రూపములో ఉన్న  అపగల్భాయ= బాలుని రూపములో ఉన్న శివునికి  నమః= నమస్కారము. తాత్పర్యము యౌవన వంతుని రూపములో ఉన్న బాలుని రూపములో ఉన్న శివునికి నమస్కారము. విశేషాలు 1. సృష్టికి , లయానికి మధ్య ఉన్న స్థితిని మధ్యమాయ ''అను పదం సూచిస్తుంది. సృష్టిలోని అన్ని రూపాలు శివునివే అని తాత్పర్యము. Photo: నమకం - ఆరవ  అనువాకం మూడవ మంత్రము (తెలుగులో ప్రతిపదార్థ  విశేషాలు )(27-02-2014) నమోమధ్యమాయచాపగల్భాయచ. नमो मध्यमाय चापगल्भाय च ।  నమోమధ్యమాయచాపగల్భాయచ మధ్యమాయ= మధ్యమ వయస్సులో అనగా యౌవన వంతుని  రూపములో ఉన్న  అపగల్భాయ=  బాలుని రూపములో ఉన్న శివునికి  నమః= నమస్కారము. తాత్పర్యము  యౌవన వంతుని రూపములో ఉన్న    బాలుని రూపములో ఉన్న శివునికి నమస్కారము. విశేషాలు 1. సృష్టికి , లయానికి మధ్య ఉన్న స్థితిని మధ్యమాయ ''అను  పదం సూచిస్తుంది.  సృష్టిలోని అన్ని రూపాలు శివునివే అని తాత్పర

శివోహం !!

Image
శుభోదయం .......అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ...... శివోహం !! ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః | సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ |.. (మనం చేయు ప్రతి పని లోను సదా శివుని పూజ ఉన్నది అని అర్ధం....)

నావుడు , అనవుడు..ఎవరు

తెలుగు లో బాష ప్రవీణ చేసాడుట ఒక కుర్రవాడు....  అతను నన్ను అడిగిన ప్రశ్న.. పరవస్తు చిన్నయ సూరి మిత్ర బేదం లో నావుడు , అనవుడు..ఎవరు వారితో కధకు సంబధం ఏమిటి నాకు తెలియుట లేదు.. మీరు వివరింప గలరా... అంటే నేను అవాక్కు అయ్యెను... Jogarao Venkata Rama Sambhara ఆర్యా, శుభోదయ నమస్కారములు తెలుగు పండితుల వారి ప్రశ్నకు సమాధానము ఇది నావుడు, అనవుడు కరటక దమనకుల బిడ్డలు. నావుడు కరటకుని కుమారుడు అనవుడు దమనకుని పుత్రుడు. వీరిరువురు మారీచ సుబాహువుల ముని మనుమలు కరటకుడి కొడుకు నావుడు నావుడి భార్య కింతు దమనకుడి కొడుకు అనవుడు అనవుడి భార్య పరంతు నావుడు కింతు ల సంతానము పశ్చాత్ అనవుడు పరంతు ల సంతానము భవతి భవంతు ఇంకా ఇంకా చాలా వుంది లెండి. జోగారావు

యమునను న డి రేయి దాటితి వంటా...

Image
యమునను న డి రేయి దాటితి వంటా...

అంతర్జాతీయ చిత్రకారుడు శ్రీ కాపు రాజయ్యకు అక్షర నీరాజనం!

Image
అంతర్జాతీయ చిత్రకారుడు శ్రీ కాపు రాజయ్యకు అక్షర నీరాజనం! టీవిఎస్ శాస్త్రి ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారుడు, కళారత్న అవార్డు గ్రహీత శ్రీ కాపు రాజయ్య 20-08-2012 న సిద్ధిపేటలో తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1993లో కళాప్రవీణ, 1997లో కళావిభూషణ్, 2000లో హంస, 2007లో లలిత కళారత్న అవార్డులు అందుకున్నారాయన. సిద్దిపేటలో జన్మించిన రాజయ్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఏడు దశాబ్దాలకు పైగా తన చిత్రాలద్వారా ఎన్నో అవార్డులందుకున్న రాజయ్య సిద్దిపేటను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. రాజయ్య చిత్రాలను పార్లమెంటు, న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, సాలార్ జంగ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లోని లలితకళా అకాడమిలో ప్రదర్శనకు ఉంచారు. సిద్దిపేటలో ఓ కళా పరిషత్ ను కూడా శ్రీ రాజయ్య స్థాపించారు. ఆధునిక చిత్రకళలో తెలంగాణ గ్రామీణ జీవితానికి కాపు రాజయ్య చిత్రం ప్రతిబింబం అయ్యింది. బీద కుటుంబంబంలో ఇద్దరు అక్కలకు తమ్ముడిగా చిన్న వ్యాపారస్తుడైన శ్రీ రాఘవులుకు 1925 ఏప్రిల్ 6వ తేదీన సిద్ధిపేటలో జన్మించిన రాజయ్య లలితకళా అకాడెమీ అవార్డ

మా యన్నల సురభు లాన మంజులవాణి!

Image
- ఓ యమ్మ! నీకుమారుఁ మా యిండ్లను బాలి పెరుఁగు మననీఁ డమ్మ! పోయెద మెక్కడి కైనను మా యన్నల సురభు లాన మంజులవాణి! చన్ను విడచి చనఁ డిట్టటు నెన్నఁడుఁ బొరుగిండ్ల త్రోవ లెఱుఁగడు నేఁడుం గన్నులు తెఱవని మా యీ చిన్ని కుమారకుని ఱవ్వసేయం దగునే? అన్య మెఱుఁగడు తనయంత నాడుచుండు మంచివాఁ డిఁత డెగ్గులు మనరమ్మ! రామలార! త్రిలోకభిరామలార! తల్లులార! గుణవతీ మతల్లులార! పోతనామాత్య "మహాభాగవతం' దశమస్కంధం నుండి.

Jaji Sarma పురాణ విజ్ఞానము

Jaji Sarma పురాణ విజ్ఞానము ప్రతిరోజు ప్రశ్న- సమాధాన రూపములలో మన పురాణములకు సంబంధించిన విషయములు తెలుసుకుందాము.  ఈరోజు ఐదు ప్రశ్న సమాధానములు  1. శ్రీ ఆదిశంకరాచార్యుల వారి తల్లిదండ్రులు ఎవరు? ఆర్యాంబ ,శివగురువు 2. శక్తి దృశ్యంతి అనే ఋషిదంపతులకు కలిగిన సంతానం ఎవరు? పరాశర మహర్షి 3. పార్వతీదేవి అమ్మవారి జన్మ నక్షత్రం ఏమిటి ? ఆరుద్ర నక్షత్రము 4. మార్గశిర మాసము ఎవరి స్వరూపము? విష్ణుస్వరూపము 5. వ్యాఘ్రపాద మహర్షి, పతంజలి మహర్షి కోరికపై శివుడు ఉమా సమేతంగా ఆనంద తాండవం చేసిన ప్రదేశం ? చిదంబర మహా పుణ్యక్షేత్రం

"హరిహరాభేదం " తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి మూర్తి స్వరూపంలో శివ, విష్ణు, శక్తి, సుబ్రహ్మణ్య అంశలు నాలుగు యిమిడి న్నాయి. బాలాజీ అన్న పేరు బాలసుబ్రహ్మణ్యం కు నిదర్శనం. స్వామి తలపై జడ, నాగాబరణాలు, బిల్వపత్రపూజ, శివస్వరుపానికి సాక్ష్యాలు. శంఖ చక్ర కిరీటాలు శ్రీమహావిష్ణువు చిన్నహములు. వెలుపలి ప్రాకారంలో, సింహశిల్పం శక్తి స్వరూపాన్ని ప్రకటించేది. ఈవిధముగా శ్రీ వెంకటేశ్వర స్వామి శివ, కేశవ, బాలసుబ్రహ్మణ్య సమన్యయమూర్తి. ఆవిధంగానే ఆ దేవుని భావించడం సమంజసం. శివ కేశవ మొదలగు భేదాలు దానిలో లేవు. ` జగద్గురువులు -- శ్రీ కంచి పరమాచార్య — with Gumma Ramalinga Swamy.

Image
"హరిహరాభేదం " తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి మూర్తి స్వరూపంలో శివ, విష్ణు, శక్తి, సుబ్రహ్మణ్య అంశలు నాలుగు యిమిడి న్నాయి. బాలాజీ అన్న పేరు బాలసుబ్రహ్మణ్యం కు నిదర్శనం. స్వామి తలపై జడ, నాగాబరణాలు, బిల్వపత్రపూజ, శివస్వరుపానికి సాక్ష్యాలు. శంఖ చక్ర కిరీటాలు శ్రీమహావిష్ణువు చిన్నహములు. వెలుపలి ప్రాకారంలో, సింహశిల్పం శక్తి స్వరూపాన్ని ప్రకటించేది. ఈవిధముగా శ్రీ వెంకటేశ్వర స్వామి శివ, కేశవ, బాలసుబ్రహ్మణ్య సమన్యయమూర్తి. ఆవిధంగానే ఆ దేవుని భావించడం సమంజసం. శివ కేశవ మొదలగు భేదాలు దానిలో లేవు. ` జగద్గురువులు -- శ్రీ కంచి పరమాచార్య — with Gumma Ramalinga Swamy. తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి మూర్తి స్వరూపంలో శివ, విష్ణు, శక్తి, సుబ్రహ్మణ్య అంశలు నాలుగు యిమిడి న్నాయి. బాలాజీ అన్న పేరు బాలసుబ్రహ్మణ్యం కు నిదర్శనం. స్వామి తలపై జడ, నాగాబరణాలు, బిల్వపత్రపూజ, శివస్వరుపానికి సాక్ష్యాలు. శంఖ చక్ర కిరీటాలు శ్రీమహావిష్ణువు చిన్నహములు. వెలుపలి ప్రాకారంలో, సింహశిల్పం శక్తి స్వరూపాన్ని ప్రకటించేది. ఈవిధముగా శ్రీ వెంకటేశ్వర స్వామి శివ, కేశవ, బాలసుబ్రహ్మణ్య సమన్యయమూర

మహా ముని కుశనాభుడు....

Image
మహా ముని కుశనాభుడు.... క్షమా దానాం క్షమా సత్యం క్షమా యజ్ఞస్య పుత్రికా క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్ క్షమా గుణమే దానము, సత్యము, క్షమయే గొప్ప యజ్ఞము, క్షమాగుణమే యశస్సు, క్షమించడమే ధర్మం, క్షమా గుణం చేతనే ఈ జగత్తంతా నడుస్తున్నది ఓ పుత్రికలారా!
Jaji Sarma పురాణ విజ్ఞానము ప్రతిరోజు ప్రశ్న- సమాధాన రూపములలో మన పురాణములకు సంబంధించిన విషయములు తెలుసుకుందాము.  ఈరోజు ఐదు ప్రశ్న సమాధానములు  1. భృగు మహర్షి కుమారుడు ఎవరు ? ప్రమతి 2. దుర్యోధనుని కూతురు పేరు ఏమిటి ?  లక్మణ 3. బలి చక్రవర్తి పెద్దకుమారుడు అయిన బాణుని కమార్తె ఎవరు ?  ఉష 4. పార్వతీ దేవి పులి వాహనం ?  శ్వేతనంది 5. గంధర్వ రాజు పేరు ఏమిటి ?  విశ్వావసువు

వైష్ణవమాయ :--

Image
వైష్ణవమాయ :-- ఒకసారి అగస్త్య మహర్షి శ్రీకృష్ణ దర్శనార్ధమై ద్వారకకు వెళ్ళి యమునకు ఆవలి దరి ఉండి తానొచ్చినట్టుగా కృష్ణమూర్తికి వర్తమానం పంపేరట.  కబురందిన కృష్ణయ్య హడావుడిగా సత్య భామను పిలిచి భామా యమునకు ఆవలి వొడ్డున అగస్త్యుల వారు విడిసి ఉన్నారు వారికి తగు ఉపచారములుకావించి నగరిలోనికి తీసుకురా, ఆఁ అన్నట్టు ఎప్పుడు భోంచేసేరో ఏమో వారికోసం భోజన సామగ్రికూడా వెంట తీసుకు వెళ్ళుమా అని చెప్పగా, అలాగే అని బయలుదేరిన సత్య భామ వెంఠనే వెనుదిరిగి వచ్చి నాధా యమున ఉద్రుతముగా ప్రవహిస్తునాది దాటి పోవుట కష్టముగా ఉన్నాది ఎలా అంటూ చెప్పిందిట.  అందుకు నల్లనయ్య నవ్వి, అస్కలిత బ్రహ్మచారి నన్ను పంపాడు, యమునమ్మా నా దారి తొలగుమా అని చెప్పు నీ పని ఐపోతుంది అని చెప్పేడట. అది విన్న సత్యభామ పక్కున నవ్వుతూ అదేమిటి స్వామీ అష్టకళత్రములు అఫిషియల్గా కాక మరో పదహారువేలమంది అనఫిషియల్ భార్యలు ఉన్న మీరా అస్కలిత బ్రహ్మచారి? చాల్లెద్దురూ మీ పరాచికాలూ అందిట.  మాధవుడు మంద్స్మిత వదనుడై, చెప్పి చూడరాదా సత్యా అన్నాడట, సరేలెమ్మనుకున్న సత్య పరివారం వెంట రాగా మొత్త సరంజామా అంతా తీసుకుని యమున వొడ్డున నిలిచి అమ్మా యమునా నన

ఉపపాండవులెందరు?

Image
ఉపపాండవులెందరు? ఈ ప్రశ్నకు సమాధానం, భారతం..ఆది.పర్వం…అశ్వాసం 4….115 “ధర్మరాజు కు పాంచాలియందు ప్రతివింధ్యుడు,భీమునికి శ్రుతసోముడు, అర్జునునకు శ్రుత కీర్తి, నకులునకు శతానీకుడు, సహదేవునకు శ్రుత సేనుడు కలిగారు. వీరు కాక ధర్మరాజుకు స్వయంవరంలో భార్యయైన దేవిక అనే ఆమెకు యౌధేయుడు కలిగాడు. భీమునికి జలంధర అనే ఆమెయందు సర్వగుడు కలిగాడు. అర్జునునకు సుభద్రయందు అభిమన్యుడు కలిగాడు. నకులునకు చేది రాజపుత్రి కరేణుమతికి నిరమిత్రుడు కలిగాడు. సహదేవునికి స్వయంవరం మూలంగా లభించిన భార్య విజయకు సుహోత్రుడు కలిగాడు.భీమునకు హిడింబ వలన ఘటోత్కచుడు కలిగాడు. వీళ్ళు మొత్తం పదకొండు మంది.” 1.ధర్మ రాజు+ద్రౌపది= ప్రతివింధ్యుడు, 2.భీముడు+ద్రౌపది= శ్రుతసోముడు 3.అర్జునుడు+ద్రౌపది= శ్రుత కీర్తి 4.నకులుడు+ ద్రౌపది=శతానీకుడు 5.సహదేవుడు+ద్రౌపది= శ్రుత సేనుడు  6.ధర్మరాజు+దేవిక=యౌధేయుడు. 7.భీముడు+జలంధర=సర్వగుడు 8.భీముడు+హిడింబ= ఘటోత్కచుడు 9.అర్జునుడు+సుభద్ర=అభిమన్యుడు. 10.నకులుడు+కరేణుమతి=నిరమిత్రుడు. 11.సహదేవుడు+విజయ=సుహోత్రుడు. వీరిలో భీమునికి హిడింబ వలన కలిగిన ఘటోత్కచుడే పెద్దవాడు. పాంచాలి

అతిరధులు

Image
కౌరవుల పక్షమున పొరాడిన అతిరధులు భీష్ముడు సుయోధనుడు శల్యుడు భూరిశ్రవుడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు అశ్వథామ బాహ్లికుడు, అతని కుమారుడు సోమదత్తుడు  కౌరవుల పక్షమున పొరాడిన మహారధులు సైంధవుడు త్రిగర్తాధిపతులు ఐదుగురు కౌరవుల పక్షమున పొరాడిన సమరధులు కాంభోజరాజు  సుదక్షిణుడు లక్ష్మణకుమారుడు శకుని అలంబసుడు భగదత్తుడు  కౌరవుల పక్షమున పొరాడిన అర్ధరధులు  మహిష్మతి అధిపతి నీలుడు అవంతీ దేశాధీశులు విందాను విందులు బృహద్బలుడు దండధారుడు కర్ణుడు  ------------------------------------------------------------------------------------------ పాండవుల పక్షమున పొరాడిన అతిరధులు అర్జునుడు ధర్మరాజు  భీమసేనుడు, భీముని కుమారుడు ఘటోత్కచుడు  అభిమన్యుడు సాత్యకి దృష్టద్యుమ్నుడు కుంతిభోజుడు పాండవుల పక్షమున పొరాడిన మహారధులు ద్రౌపదికి పుట్టిన ఉపపాండవులు  ఉత్తరుడు,  ద్రుపదుడు  విరాటుడు శిఖండి ఉత్తమౌజుడు యుధామన్యుడు క్షత్రదేవుడు జయంతుడు అమితౌజుడు విరాటుడు సత్యజితుడు కేకయరాజులు అయిదుగురు కాశీశుడు నీలుడు సూర్యదత్తుడు మది

ఎప్పుడో 35-40 ఏళ్ల క్రితం సి.నా.రె. గారు అన్న కింద పంక్తులు.

Image
ఎప్పుడో 35-40 ఏళ్ల క్రితం సి.నా.రె. గారు అన్న కింద పంక్తులు.  గుండెలను కలిపి కుట్టే భాషా సూత్రంతో  గొంతులకు ఉరులు పేనుతున్నారు సంప్రతింపులు విరిసే నీతి మండపాన్ని సంతలోకి దించేస్తున్నారు  ఈ కొండ గోలలో – ఈ మొండి గోలలో  సంగీతానికి చరమ స్థాయి  గంగిరెద్దులవాని సన్నాయి  వినేదెవ్వడు ఓహో అనేదెవ్వడు సంపాదక మహాశయా క్షమించాలి  కలంలో కలకలం పెరిగింది  జాతి గళం లో హాలాహలం మరిగింది  అది ఉద్గీర్ణమైతే శ్మశానం రగులుతుంది  జీర్ణమైతే కళ్యాణం మిగులుతుంది .

అర్జంటుగా హనుమంతుల వారిని పిలవాలి... హై టెక్ సిటీ ను ఆంధ్రకు మార్చాలి ... సంజీవ పర్వతములగా..

Image
అర్జంటుగా హనుమంతుల వారిని పిలవాలి... హై టెక్ సిటీ ను ఆంధ్రకు మార్చాలి ... సంజీవ పర్వతములగా..

ఛీ, ఇదేం జాతి!

Image
. ఛీ, ఇదేం జాతి! కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో! కైటభదైత్యమర్దనుని గాదిలికోడల ఓ మదంబ ఓ హాటకగర్భురాణి నినునాకటికై గొనిపోయి యల్ల క ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ, నమ్ము భారతీ! ఇప్పుడు కర్ణాటకిరాట కీచకులు లేరు. అసలు రాచరికమే లేదు. ఆకలికోసం "బాలరసాలసాల నవపల్లవ కోమలమైన" కావ్యకన్యకని మనుజేశ్వరాధములకిచ్చే అవస్థ తప్పిపోయింది. అయినా ఆ తల్లి కాటుకకంటినుండి కన్నీరింకా ధారగా ప్రవహిస్తూనే ఉంది. ఎందుకమ్మా అలా ఏడుస్తావని మనసార ఓదార్చే, మనసావాచాకర్మణా నీకు కష్టం కలిగించనమ్మా అని భరోసా ఇచ్చే పోతనలాంటి బిడ్డలు ఆమెకిప్పుడు కఱవయ్యారు. ఈర్ష్య, అసూయ, స్వార్థం,ద్వేషాలతో తమలోతాము కాట్లాడుకుంటూ ఆమె బతుకుని కుక్కలు చింపిన విస్తరి చేసే బిడ్డలు పుట్టుకొచ్చారు. ఛీ, ఇదేం జాతి!

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే?

Image
Gumma Ramalinga Swamy భాగవతము -- పోతన మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే? మదనములకు  నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే ? తరంగిణులకు  లలితా రసాల పల్లవ ఖాదియైచోక్కు కోయిల సేరునే? కుటజములకు  బూర్నేందు చంద్రికా స్పురిత చకోరకమ్మరుగునే? సాంద్రనీహారములకు  అంబుజోదర దివ్య పాదారవింద  చింతనా మృత పాన విశేషమత్త  చిత్త మేరీతి నితరంబు జేరనేర్తు? వినుత గుణసీల ! మాటలు వేయునేల ? ప్రహల్లాదునికి ఈ హరి భక్తీ గువులే నేర్పుచున్నారనే అనుమానం తండ్రికి కలిగింది. ప్రతీ వ్యక్తికీ సంస్కారాన్ని బట్టి మనసు మార్గం అబ్బుతాయి .భగవంతుడే తప్ప మరో ఆలోచన లేని మనస్సుకి ఇంకొకరు చెప్పడం వినడం ఉండదని., పోతన అభిప్రాయం .అతనూ ఆకోవకు చెడిన వాడే కదా !తన అభిప్రాయాని భక్తుడయిన బాలకుని చే చెప్పించాడు.వృద్యంగా తను చెప్పదలచుకున్నది . ఒకరడిన ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నలే గుప్పించడం ఇందులోని విశేషం . ఈ పద్య భక్తికిపట్టుకొమ్మ . అర్ధం చెబుతాను. మందార పువ్వుల తేనెల మాధుర్యానికి అలవాటు పడ్డ తుమ్మెద ఉమ్మేత్తు చెట్ల వైపుకు పోవునా? స్వచ్చమయిన నిర్మల మయిన గంగానదిలో తేలియాడు రాజ హంసలు వాగులకు వంకలకు పోవునా