మా యన్నల సురభు లాన మంజులవాణి!

-

ఓ యమ్మ! నీకుమారుఁ

మా యిండ్లను బాలి పెరుఁగు మననీఁ డమ్మ!

పోయెద మెక్కడి కైనను

మా యన్నల సురభు లాన మంజులవాణి!

చన్ను విడచి చనఁ డిట్టటు

నెన్నఁడుఁ బొరుగిండ్ల త్రోవ లెఱుఁగడు నేఁడుం

గన్నులు తెఱవని మా యీ

చిన్ని కుమారకుని ఱవ్వసేయం దగునే?

అన్య మెఱుఁగడు తనయంత నాడుచుండు

మంచివాఁ డిఁత డెగ్గులు మనరమ్మ!

రామలార! త్రిలోకభిరామలార!

తల్లులార! గుణవతీ మతల్లులార!

పోతనామాత్య "మహాభాగవతం' దశమస్కంధం నుండి.


Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !