'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!
పోతన గారి భాగవత పద్యం.! . 'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా ... కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ".! . (చదువుకోడానికి హాయిగా ఉండే పద్యం .) . సరస్వతీ మాత దర్శనం పోతనకింకా కాలేదు . ఆ దర్శనంకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృమూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నాడు . అందరూ అనుకునే మాట . సరస్వతీ మాత తెలుపు రంగులో ధగధ్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని . ఇక తన ఊహలకు పదను పెట్టాడు . శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల వంటి తెలుపా లేక శారద చంద్రబింబం లాగా ఉంటుందా కాదు కాదు పచ్చకర్పూరం లాంటి తెలుపేమో మాతది . ఊహకు అందలేదు . తెల్లని పటీరమూ (చందనం) , రాజహంసా , జాజిచెండ్లూ , నీహారాలూ (మంచు తుంపెరలు) , డిండీరం ( నురుగు ) , వెండికొండా , రెల్లుపూలూ , మల్లెలూ , మందారాలూ , పుండరీకాలూ ( తెల్ల తామర పూలు ) , ఆదిశేషుడూ , అన్నిటికీ మించి ఆకాశ గంగా ప్రవాహం — తెల్లగా , తేలికైన పసుపురంగుతో ఉండే వస్తువులన్నీ మదిలో భాసించాయి . ఏవీ మాతృమూర్తి తెలుపు రంగుకు ఉపమానాలుగా సరిపోలేదు . మాతృమూర్తిని ఆర్తితో అడిగ...
ఎన్నాళ్ళ నుండో ఉన్న సందేహాలు తీరాయి.
ReplyDeleteకురుక్షేత్రం తర్వాత బ్రతికి ఉన్నవారిలో యౌధేయుడు కూడా ఒకడు. అయితే అతను కూడా బభ్రువహనుడి లాగే తాతగారి రాజ్యానికి వారసుడిగా దౌహిత్రునిగా ధర్మరాజు వివాహానికి పూర్వమే అంగీకరించడం వలన యుద్ధంలో పాల్గొనకుండా తాతగారి రాజ్యం లోనే ఉండిపోయాడు. అందువలననే అతను ధర్మరాజు తర్వాత కూడా హస్తినాపురానికి రాజు కాలేదు.
ReplyDeleteనాగకన్య ఉలూపి (ఉలూచి) అర్జునుల కుమారుడు ఇరావంతుడు. ఇతను కూడా మహాభారత యుద్ధంలో మరణించాడు.
ReplyDeleteఓ విధంగా కురుక్షేత్ర యుద్ధం చాలా మంది క్షత్రియులను పొట్టన బెట్టుకుంది. కాని అందులో గల మర్మమేమంటే.. ధర్మానిదే విజయం.. అన్నాదమ్ముల నడుమ వైరం ఎంతటి ఘోరానికైనా ఉసిగొల్పగలదనే నీతి ఇందులోనే ఇంప్లిసిట్ గా బోధపడేటటువంటి విషయం.
Deleteఐతే నాదోక సందేహం.. ఆ కాలంలో వీరులందరికి అమ్మాయిలే పుట్టలేదా..? లేదా.. ఆయా వీరాంగనాలు తరవాతి కాలం లో ఓ రుద్రమ, ఓ మణికర్ణికలుగా అవతరించారేమో..
Deleteమీ సందేహం సబబైనదే, శ్రీధరా 🙂.
Delete// “ ఆయా వీరాంగనాలు తరవాతి కాలం లో ఓ రుద్రమ, ఓ మణికర్ణికలుగా అవతరించారేమో..” // పోనీ అలానే అనుకున్నా కూడా అసలు వాళ్ళ జన్మ గురించిన ప్రసక్తి అంటూ ఉండాలిగా?
నేనా కోణం లో అడగలే దాచార్య.. అనంటే.. /*ధర్మ రాజు+ద్రౌపది= ప్రతివింధ్యుడు,
Delete2.భీముడు+ద్రౌపది= శ్రుతసోముడు
3.అర్జునుడు+ద్రౌపది= శ్రుత కీర్తి
4.నకులుడు+ ద్రౌపది=శతానీకుడు
5.సహదేవుడు+ద్రౌపది= శ్రుత సేనుడు */ లలో కేవలం పుత్రులనే ఊటంకించారు తదా శర్మాచార్య వారు.. మరి వారికి ఆడ సంతానం లేదా.. లేదా ఆ కాలం నుంఢే ఈ నాటి "బేటి బచావో" ఆందోళన్ లేదా..! డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ కం జెనెటిక్ ఇంజినియరింగ్ ఆ కాలం లోనే ఉండిందా.. ఆ లెక్కన చూస్తే కురుక్షేత్ర కాలం కంటే మునుపే భారతావనినా సైంటిఫిక్ బూముండే దన్నమాట..!