సత్యహరిశ్చంద్రీయము : కాశీపుర స్మశాన పరిసరారణ్యము.! (బలజేపల్లి లక్ష్మి కాంత కవి .) .

సత్యహరిశ్చంద్రీయము : కాశీపుర స్మశాన పరిసరారణ్యము.!

(బలజేపల్లి లక్ష్మి కాంత కవి .)

.

సీ.

కాఁబోలు బ్రహ్మరక్షస్సమూహం బిది-ఘోషించుచుండె ఋక్కుల క్రమంబు

కాఁబోలు వీరు విగత జీవబాంధవు-లడలుచుండిరి మహార్తారవములఁ

గాఁబోలు వీరు టక్కరి భూతమాంత్రికుల్‌-నెమకుచుండిరి కపాలముల కొఱకు

గాఁబోలు నిది పిశాచీబాంధవ శ్రేణి-పలలంపు బువ్వంపు బంతి సాగెఁ

జిట్లుచున్నవి కాఁబోలు చితులలోనఁ-గాల్పఁబడెడు శవాల కంకాళ సమితి

నెటఁబెడీలను రవములే యొసఁగుచుండు-దిక్కులన్నిండ మార్మోగింత పిక్కటిల్ల.

.

గీ. కాటిసుంకంబు చెల్లింపకయె శవాల

మసనమునఁ గాల్పరే కద మనుజులార?

కాఁపు లేదనుకొంటిరేమో పదండు

దళిత ఘోరారి యీ వీరదాసు గలఁడు.

.......

శా. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌

నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం

తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో

నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్‌.

..........

ఓహో! ఎవ్వతె వీవు?

స్రగ్ధర: పడతీఁ యేకాకివై నిర్భయమున నిటకున్‌ వచ్చి నా యాజ్ఞ లేకీ

నడిరేయిన్‌ వల్లకాట న్శవ దహన విధి న్సల్పుచున్నావుగా! ఛీ

చెడుగా చాల్లాలు పోపో చెడెదవు తగునే చేడె కీకృత్యముల్‌ నా

కడనా నీ మ్రుచ్చు వేసాల్కదలు కదలుమా కాడు నీ యబ్బ సొమ్మా!

.........

ఏమీ! ఇంకేమీ లేదా? చూడు,

మ. దళమౌ పయ్యెదలో నడంగియు సముద్యత్కాంతు లీరెండలన్‌

మలియింపన్‌ దిశలన్‌ ద్వదీయ గళసీమన్‌ బాలసూర్యప్రభా

కలితంబై వెలుగొందుచున్నదది మాంగల్యంబు కాఁబోలు! నే

వెలకైనం దెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్‌ జెల్లదే?

.

అయ్యో! దైవమా! రెండవ సురజ్యేష్ఠుండగు వసిష్ఠ మహర్షి ప్రభావంబుచే నా పతికి దక్క నన్యులకు గోచరంబు కాని నా మంగళసూత్రం బొక్క చండాలుని కంటఁ బడెనా! కాదు కా దీతఁడు నా పతి హరిశ్చంద్రుడే. 

.

ఇది హరితసగోత్ర పవిత్రనృసింహ మనీషి వరపుత్త్ర బుధజనవిధేయ

లక్ష్మీకాంత నామధేయ ప్రణీతంబైన శ్రీ హరిశ్చంద్రీయనాటకంబు .!

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!