Posts

Showing posts from March, 2020

🚩 యాతమేసి తోడినా ఏరు ఎండదు!

Image
🚩 యాతమేసి తోడినా ఏరు ఎండదు! . యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు దేవుడి గుడిలోదైనా పూరి గుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు ఆ దీపముండదు | ౧ పలుపు తాడు మెడకేత్తే పాడి ఆవురా పసుపు తాడు ముడులేత్తే ఆడదాయెరా కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది కడుపుకోత కోసినా అది మనిషికే జన్మ ఇత్తాది బొడ్డుపేగు తెగిపడ్డ రోజు తలుసుకో గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో || ౨ అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే సీమునెత్తురులు పారే తూము ఒక్కటే మేడమిద్దెలో ఉన్నా సెట్టు నీడ తొంగున్నా నిదర ముదర పడినాక పాడె ఒక్కటే వల్లకాడు ఒక్కటే కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా || 🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂

🚩మాయాబజార్ కథా కమామీషు.🌹

Image
🚩మాయాబజార్ కథా కమామీషు.🌹 ☘️🍂☘️ నేటికి63 ఏళ్ళ క్రితం భారత చలనచిత్ర చరిత్రలోనే ఓ అద్భుతం విజయా వారి 'మాయాబజార్' రిలీజ్ అయింది.ఈ చిత్ర చరిత్రను చూస్తే.... ఈ సినిమా ఇప్పటికి పదకొండు సార్లు( ఒకసారి సాంఘీకం) తీశారు. తొలిసారిగా 1925 లో 'మాయాబజార్ ఉరఫ్ సురేఖా హరణ్'అనే పేరుతో దర్శకుడు బాబూరావ్ పెయింటర్ మూకీగా తీశాడు. ఇందులో విఖ్యాత దర్శకుడు వి.శాంతారాం శ్రీకృష్ణ పాత్రధారి. టాకీ గా హిందీలో 1932 లో వానుభాయ్ వకీల్ దర్శకత్వంలో వచ్చింది. తరువాత ఆర్. పద్మనాభన్ దర్శకత్వంలో'మాయాబజార్ ఉరఫ్ వత్సలా కల్యాణం' గా 1935 లో తమిళంలో వచ్చింది. తర్వాత పి.వి.దాస్ దర్శకత్వంలో 'మాయాబజార్ ఉరఫ్ శశిరేఖా పరిణయం' గా తెలుగులో వచ్చింది. దీనిలో శాంతకుమారి శశిరేఖ. ఆతర్వాత మరాఠీ లో జి.పి.పవార్ దర్శకత్వంలో 1939 లో 'మాయాబజార్'గానూ,'మాయాబజార్ ఉరఫ్ వత్సలా హరణ్' పేరుతో మళ్ళీ హిందీ,మరాఠీ లలో దత్తా ధర్మాధికారి దర్శకత్వంలోనూ,1949 లో 'వీర ఘటోత్కచ్ ఉరఫ్ సురేఖా హరణ్' పేరుతో నానాభాయ్ భట్ దర్శకత్వంలోనూ,విడుదల అయ్యింది. దీనిలో మీనాకుమారి హీరోయిన్. 1957 లో తెలుగు, తమి...

*దేవుడు కాస్త పక్కకు జరిగాడు.*

Image
*దేవుడు కాస్త పక్కకు జరిగాడు.*   *దేవుడు అనుమతించాడు.*   *కారణం మనిషి దేవుడికి దూరమయ్యాడు.*   *కరోనా కరాళ నృత్యం చేస్తుంది.*   *మనిషి గర్వించాడు.*   *తాను సృష్టించిన సంపదను చూసి,*   *తాను తయారు చేసిన మందులను, మెడికల్ కేర్ ను చూసి,*   *వ్యాయామాలను,*  *యోగాలను*   *చూసి* ,  *తాను సంపాదించిన జ్ఞానాన్ని చూసి,*   *తాను కనిపెట్టిన టెక్నాలజీని చూసి,*     *నాకేమి నేను సేఫ్ అనుకొన్నాడు.*   *ఎవ్వరి కరుణా వీక్షణాలతో ఈ జగత్తు అనంత కాలం నుంచి సురక్షితముగా ఉన్నదో...*   *ఆ జగద్రక్షకుడిని విస్మరించింది, మానవ సమాజం.*   *మనిషి దేవుడికి దూరం అయ్యాడు. దేవుడు కూడా మనిషికి దూరం *అయ్యాడు.*   *ఎంతో గొప్ప జ్ఞానిని అని విర్రవీగిన మనిషి,  ఒక చిన్న కంటికి కనపడని సూక్ష్మ క్రిమితో పోరాడలేక తల్ల* *క్రిందులవుతున్నాడు* .  *కంటికి కనపడని ఈ సూక్ష్మ క్రిమి*   *మనిషి శరీరానికి హా...

🚩భానుమతి గారి “అత్తగారు - ఆవకాయ”!

Image
🚩భానుమతి గారి “అత్తగారు - ఆవకాయ”! ☘️ఆవకాయ పెట్టటంకన్న యజ్ఞం చేయటం తేలిక,  యజ్ఞం చేస్తే ఫలం అన్నా దక్కుతుంది,  మరి కొంతమంది ఆవకాయ పెడితేనో ఫలితం కూడా దక్కదు.  అసలు ఆవకాయ పెట్టటం అన్నదే ఓ పెద్ద ప్రహసనం.  అందునా నూజివీడు చిన్నరసాలకు అలవాటుపడ్డ ప్రాణానికి  వేరేకాయతో ముద్దదిగదు.  విషయానికి వస్తే “ఆధునిక తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా  నిలిచిపోయే పాత్రలు చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి.  ఆ చిరంజీవుల జాబితాలో చేరుతుంది భానుమతి ‘అత్తగారు’,”  అన్నారు శ్రీ కొడవటిగంటి వారు. బహుముఖ ప్రజ్ఞాశాలి  అయిన భానుమతీ రామకృష్ణగారి “అత్తగారు – ఆవకాయ”  మరొకమాటు రుచి చూద్దాము, 1958 నాటి ఆంధ్ర పత్రిక నుండి. # ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం # ఆవకాయలో ఎరుపు --- "రవి" # ఆవకాయలోవేడి, తీక్షణత --- "కుజుడు" # ఆవకాయలో వేసే నూనె, ఉప్పు --- "శని" # ఆవకాయలో వేసే పసుపు, మెంతులు --- "గురువు" # మామిడిలో ఆకుపచ్చ --- "బుధుడు" # మామిడిలో పులుపు --- "శుక్రుడు" # ఆవకాయ తినగానే కలిగే, అలౌకికానందం --- "క...

"కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్ (K. V. Mahadevan)"

Image
🌹 🎼 నేడు సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు  "కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్  (K. V. Mahadevan)" గారి జయంతి..  ఆ సంగీత సామ్రాట్ ను గుర్తుచేసుకుంటూ...🎼🌹*_ 🚩ఆయ‌న సంగీతాన్ని ఎలా కొల‌వాలి..? ఏ రీతిన వ‌ర్ణించాలి? శంక‌రా.. నాద‌శరీరాప‌ర అనే పాటిచ్చినందుకు ఆయ‌న్ని క్లాస్  అనాలా?? 👉చిట‌ప‌ట చినుకులు ప‌డుతూ ఉంటే అంటూ ఆ చినుకుల్లో త‌డిసి  ముద్ద చేసినందుకు పాటిచ్చినందుకు రొమాంటిక్ అనాలా?? 👉ము.. ము.. ము.. ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా అంటూ  కవ్వించినందుకు,  ఆరేసుకోబోయి పారేసుకొన్నాను.. అంటూ  ఊరించినందుకు ప‌క్కా మాస్ అనాలా?? 👉ముత్య‌మంతా ప‌సుము ముఖ‌మంత ఛాయ - అంటూ  ముత్తైదువుల జాతీయ గీతాన్నిచ్చినందుకు మ‌హిళా ప‌క్ష‌పాతి  అనాలా? 👉ఎవ‌రేమ‌న్నా అనుకోండి! ఆయ‌న్ని ఎలాగైనా పాడుకోండి.  తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న ఓమామ‌!  సంగీత బ్ర‌హ్మా. నిదురించే తోట‌లోనికి పాట‌లా వ‌చ్చిన కోయిల‌మ్మ‌.. కె.వి.మ‌హ‌దేవ‌న్‌. 👉``ఏమీ ఎర‌గ‌ని నగ్న‌శాఖ నుంచి ఆకులు ఎలా పుట్టుకొస్...

సుమతీ శతకము!

Image
సుమతీ శతకము! VINJAMURI VENKATA APPARAO·WEDNESDAY, 11 MARCH 2020· సుమతీ శతకము! - తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉంది. బహుజన ప్రియమైన శతాకాలలో సుమతీ శతకం ఒకటి. ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పద్యలు తెలియని తెలుగువారు అరుదు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను సామెతలు లేదా జాతీయములుగా పరిగణించ వచ్చును. - సుమతీ శతకం వ్రాసినదెవరో కచ్చితమైన సమాచారం లభించడంలేదు. పలు రచనల్లో "సుమతీ శతక కర్త" అని ఈ రచయితను ప్రస్తావించడం జరుగుతుంది. క్రీ.శ. 1220-1280 మధ్య కాలంలో బద్దెన లేదా భద్ర భూపాలుడు అనే కవి సుమతీ శతకం రచించాడని సాహితీ చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు కాకతీయ రాణి రుద్రమదేవి (1262-1296) రాజ్యంలో ఒక చోళ సామంత రాజు. ఈ రచయితే రాజనీతికి సంబంధించిన సూక్తులతో నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇతడు మహాకవి తిక్కనకు శిష్యుడు. . సుమతీ శతకాన్ని బద్దెనయే రచించినట్లయితే తెలుగు భాషలో వచ్చిన ...

ఊర్మిళ దేవి నిద్ర...

Image
ఊర్మిళ దేవి నిద్ర... జనకుడు,కుశద్వజుడు అన్నదమ్ములు . జనకుడు మిధిలకు రాజు. కుశద్వజుడు నాంకశ్య దేశానికి ప్రభువు. జనకునికుమార్తె సీత, కుశధ్వజుడికి ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తి అని ముగ్గురు కుమార్తెలున్నారు శివధనుర్భంగం చేసి శ్రీరాముడు సీతను పెళ్ళాడిన సమయంలోనే కుశధ్వజుడు కూడా తన కుమార్తెలు ముగ్గురిని రాముడి తమ్ములగు లక్ష్మణ, భరత, శత్రుఘ్నలకు ఇచ్చి వివాహం జరిపించెను . లక్ష్మణుడి భార్య ఊర్మిళ, భరతుడి భార్య మాండవి, శత్రఘ్నుడి భార్య శ్రుతకీర్తి. పితృవాక్య పరిపాలనార్దం శ్రీరాముడు సీతను వెంటపెట్టుకుని అరణ్యాలకు పయనమైనప్పుడు అతన్ని విడిచిపెట్టలేక తమ్ముడు లక్ష్మణుడుకూడా వనాలకు బయలుదేరాడు . అప్పుడు ఊర్మిళ తానుకూడా రావడానికి అనుజ్ణ ఇవ్వమని భర్తను వేడుకున్నది. అయితే లక్ష్మణుడు అందుకు అంగీకరించక... దేవి ! నిద్రాహారాలు లేకుండా పదునాలుగేండ్లు సీతా – రాముల వెంట ఉండి వారికి సేవచేయడానికి వెడుతున్నాను నేను, అయిననూ సూర్య వంశ స్త్రీలు బావగారు నడిచిన త్రోవన నడవరాదు కాబట్టి నీవు అరణ్యాలకు రావడంతగదు అని నచ్చచెప్ప ప్రయత్నం చేయపోవునంతలో... రక్షకబటుడు వచ్చి రాజా! మిమ్ములను రాముల వారు పిలిస్...