*దేవుడు కాస్త పక్కకు జరిగాడు.*



*దేవుడు కాస్త పక్కకు జరిగాడు.* 


 *దేవుడు అనుమతించాడు.* 


 *కారణం మనిషి దేవుడికి దూరమయ్యాడు.* 


 *కరోనా కరాళ నృత్యం చేస్తుంది.* 


 *మనిషి గర్వించాడు.* 


 *తాను సృష్టించిన సంపదను చూసి,* 


 *తాను తయారు చేసిన మందులను, మెడికల్ కేర్ ను చూసి,* 


 *వ్యాయామాలను,*  *యోగాలను* 

 *చూసి* ,


 *తాను సంపాదించిన జ్ఞానాన్ని చూసి,* 


 *తాను కనిపెట్టిన టెక్నాలజీని చూసి,* 

 

 *నాకేమి నేను సేఫ్ అనుకొన్నాడు.* 


 *ఎవ్వరి కరుణా వీక్షణాలతో ఈ జగత్తు అనంత కాలం నుంచి సురక్షితముగా ఉన్నదో...* 


 *ఆ జగద్రక్షకుడిని విస్మరించింది, మానవ సమాజం.* 


 *మనిషి దేవుడికి దూరం అయ్యాడు. దేవుడు కూడా మనిషికి దూరం *అయ్యాడు.* 


 *ఎంతో గొప్ప జ్ఞానిని అని విర్రవీగిన మనిషి,  ఒక చిన్న కంటికి కనపడని సూక్ష్మ క్రిమితో పోరాడలేక తల్ల* *క్రిందులవుతున్నాడు* .


 *కంటికి కనపడని ఈ సూక్ష్మ క్రిమి* 


 *మనిషి శరీరానికి హాని కలిగించడం మాత్రమే కాదు,* 


 *కూబేరులను బికారులుగా మార్చుతుంది...* 


 *సంపన్న దేశాల సంపదను అదృశ్యం చేస్తుంది..* 


 *మనుషులను అస్పృస్యులుగా మార్చివేసింది..* 


 *దేశాధ్యక్షుల నుంచి,  సామాన్యుల వరకు,  మతం కులం,  జాతి తేడా లేకుండా అందరిని భయపెడుతుంది...* 


 _ఓ జ్ఞానీ నీ జ్ఞానమెక్కడ?_ 


 _ఓ శాస్త్రజ్ఞుడా నీ మేధస్సు ఎక్కడ?_ 

 

 _ఓ ధనవంతుడా నీ ధనమెక్కడ_ ?


 _ఓ మతాభి మాని నీ మతమెక్కడ?_ 


 _ఓ జాత్యహంకారీ నీ జాతెక్కడ?_ 


 *నీవు ఏర్పరచుకున్న,  నీవు గర్వించిన ఇవేవీ ఈ చిన్న క్రిమిని ఓడించలేకున్నాయి ఎందుకని?* 


 *ఇక చాలు,  నీ గర్వాన్ని తొలగించుకో,  ఈ భూమి మీద నీకు క్షేమం లేదన్న విషయం గ్రహించు.* 


 *ఒక్క క్షణం దేవుడు దూరమైతే,  వినాశనమే నన్న సత్యాన్ని  గ్రహించు.* 


 *దేవునికి దగ్గరగా జరుగు.* 


 *దేవునికి దగ్గర కావడమంటే,* 


 *తోటి మనిషిని ప్రేమించడమేనన్న సత్యాన్ని గ్రహించు.* 


 _నేను ఎవరిని?  అనే సమాధానం దొరకని ప్రశ్నతో సమయం వ్యర్థం చేయకుండా..._ 


 _నీవు దేవుని చేతి వన్న సత్యాన్ని  గ్రహించి,_ 


 _ఈ సమాజాన్ని ప్రేమతో చెక్కడం ప్రారంభించు._ 


 *నే నిక్కడ ఎందుకున్నాను? అని ప్రశ్నించుకోవడం జ్ఞానము అనుకోకుండా.* 


 *నీ అవసరం ఎక్కడ వుందో అక్కడ ఉపయోగపడడమే నీ జన్మకు సార్ధకమన్న సత్యాన్ని గ్రహించు.* 


🙏 *స్వార్ధం, కులం,  మతం,  జాతి, అహంకారం లేని* 


 *దేవుడు కోరుకున్న* 

 *ప్రేమ, సత్యం, నిజాయితీ అనే* 

 *మన అనాది కాలపు* *మానవత్వపు* *పునాది మీద అందరం ఒకటై* *నిలబడినప్పుడు, దేవుడు కూడా మనతో కలిసి* *నిలబడతాడు* . 🙏


 *అప్పుడు... ఒక్కటేం కర్మ,  వేయి కరోనాలు కూడా...* 

 *పుట్టడానికే భయపడుతాయి.*


Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!