🚩భానుమతి గారి “అత్తగారు - ఆవకాయ”!



🚩భానుమతి గారి “అత్తగారు - ఆవకాయ”!

☘️ఆవకాయ పెట్టటంకన్న యజ్ఞం చేయటం తేలిక, 

యజ్ఞం చేస్తే ఫలం అన్నా దక్కుతుంది, 

మరి కొంతమంది ఆవకాయ పెడితేనో ఫలితం కూడా దక్కదు. 

అసలు ఆవకాయ పెట్టటం అన్నదే ఓ పెద్ద ప్రహసనం. 

అందునా నూజివీడు చిన్నరసాలకు అలవాటుపడ్డ ప్రాణానికి 

వేరేకాయతో ముద్దదిగదు. 

విషయానికి వస్తే “ఆధునిక తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా 

నిలిచిపోయే పాత్రలు చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. 

ఆ చిరంజీవుల జాబితాలో చేరుతుంది భానుమతి ‘అత్తగారు’,” 

అన్నారు శ్రీ కొడవటిగంటి వారు. బహుముఖ ప్రజ్ఞాశాలి 

అయిన భానుమతీ రామకృష్ణగారి “అత్తగారు – ఆవకాయ” 

మరొకమాటు రుచి చూద్దాము, 1958 నాటి ఆంధ్ర పత్రిక నుండి.


# ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం


# ఆవకాయలో ఎరుపు --- "రవి"


# ఆవకాయలోవేడి, తీక్షణత --- "కుజుడు"


# ఆవకాయలో వేసే నూనె, ఉప్పు --- "శని"


# ఆవకాయలో వేసే పసుపు, మెంతులు --- "గురువు"


# మామిడిలో ఆకుపచ్చ --- "బుధుడు"


# మామిడిలో పులుపు --- "శుక్రుడు"


# ఆవకాయ తినగానే కలిగే, అలౌకికానందం --- "కేతువు"


# తిన్న కొద్దీ తినాలనే ఆశ --- "రాహువు"


# ఆవకాయ కలుపుకునే అన్నం --- "చంద్రుడు"


# ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని, నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే, సమస్త గ్రహ దోషాలు ఔట్, హాం ఫట్.

😛😜😆😄


శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!


ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!


బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!

〰〰〰〰〰〰


ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి :


చెక్కందురు, డిప్పందురు,

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్

డొక్కందురు, మామిడి

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా !

〰〰〰〰〰〰


ఆవకాయ ఉపయోగాలు :


ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇది వాడి చూడు బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా !


ఇందువలదందు బాగని

సందేహము వలదు ;

ఊట సర్వరుచి హరం ఎందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!

〰〰〰〰〰〰


ఆవకాయ అవతరణ :


“చప్పటి దుంపలు తినుచును,

తిప్పలు పడుచుంటిమయ్య దేవా,

దయతో గొప్పగు మార్గం

బొక్కటి చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”


ముక్కోటి దేవులందరు

మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన ముక్క తిననివాడు కొండముచ్చై పుట్టున్!!!


చారెరుగనివాడును,

గోదారిన తా నొక్కమారు తడవని వాడున్,

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగువాడు కాడోయ్!!!


Dedicated to All Aavakaaya Lovers

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!