Posts

శివ ధ్యాన శ్లోకాలు !....(6)

Image
శివ ధ్యాన శ్లోకాలు !....(6) . "మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమానవపుషం శుచస్మితమ్, చండదీధితి మఖణ్డవిగ్రహం చిన్తయేన్మునిసహస్ర సేవితమ్." . మండలములోపలనున్నవాడును, స్వర్ణమయంబగు రూపముగలవాడును, ప్రకాశించుచున్న దేహముగలవాడును, స్వచ్ఛమయిన చిఱునగవుకలవాడును, సర్వవ్యాపకమయిన ఆకారముకలవాడును,ఋషి సహస్రములచే సేవింపబడినవాడు అగు సూర్యుని ధ్యానించుచున్నాను. . దేవత: ఆదిత్యమూర్తి అగు రుద్రుడు ఋషి: కాలుడు / మరుత్వంతుడు x

జై బాల హనుమా.

Image
జై బాల హనుమా.

సరదా కబూర్లు ..

Image
శుభరాత్రి.! . సరదా కబూర్లు .. B.సరోజగారిమతాలలో. . "ఆత్మబలం" షూటింగు జరుగుతూన్నప్పుడు, మా బంధువులు, సన్నిహితులూ నన్ను చూడడానికి వచ్చారు. నేను వాళ్ళను కలవడానికి లేస్తూన్నాను. అలా నిలబడుతూండగా, A.N.R. నా జడ పట్టుకున్నారు. నన్ను లేవనీయకుండా "నీ జడ నా చేతిలో ఉంది. ఎలా వెళ్తావు? వెళ్ళాలన్నా వెళ్ళలేవు." అన్నారు నాటకీయ ఫక్కీలో. నేను కూడా తమాషా చేస్తూ, తటాలున ఆయన విగ్గును పట్టుకుని, ”ఇప్పుడు మీ విగ్గు నా చేతుల్లో ఉంది, నా జడ లాగితే నష్టమేం లేదు గానీ, మీ విగ్గుఊడితేనే డేంజర్. అందుకని, నా జడను మీరు వదిలేస్తే నేను మీ కృత్రిమ జుత్తును వదిలేస్తాను." - ఇలా నేననగానే వెంటనే నా జడను వదిలేసారు. "తల్లీ! నీకో నమస్కారం. ఇంత మందిలో నా విగ్ కాస్తా ఊడిపోతే నాకెంతవమానం!? అమ్మా! మనిద్దరి మధ్యనా గలాభా ఎందుకులే, వెళ్ళి రా తల్లీ! పోయి రావమ్మా!” అన్నారు. నేను "అలా రండి దారికి!" అన్నాను.

విజయభాస్కర ఉవాచ!

Image
నీటికి పారే గుణం మనిషికి ప్రశ్నించే గుణం సహజం. . నీరు నిలబడితే కుళ్ళు కంపుతో మురుగవతుంది  . ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతే మనిషి మెదడు మొరడవుతుంది. ప్రశ్నించే గుణాన్ని ఏ మతము అణచిపెడుతుందో అది మరుగవుతుంది. .. విజయభాస్కర ఉవాచ! . ఏమో ఏమో ఇది......నాకు ఏమోఏమో అర్ధం అవుతున్నది. రామునికికూడా అంతుచిక్కని ప్రశ్న.. నేను ఎవరు?

చింతచెట్టు!

Image
చింతచెట్టు! . చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు చింత చిగురు పుల్లగున్నాదోయ్ నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్ చింత చెట్టు చిగురు చూడు, చిన్నవాడి బెదురు చూడు చింత చెట్టు కాపుకొచ్చిందోయ్ నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్  . చింతచెట్టులాటిన్ పేరు-టామరిండస్ ఇండికా. కుటుంబం-లెగ్యుమినేసీ(ఫాబేసీ).  . ఇది ఎత్తుగా పెరిగే వృక్షం, లావైన కాండం, నల్లటి బెరడు కలిగివుంటుంది. చిన్న చిన్న ఆకులు గుత్తులుగా వుంటాయి. దీనికి గుత్తులుగా మూడు రెక్కలతో  పసుపు రంగులో పూలు పూస్తాయి.దీనికాయలు పొడవుగా ,మందంగా,  గోధుమ రంగులో వుంటాయి ,రుచి పుల్లగా వుంటుంది, పచ్చడి గాను ,కూరల్లోను దీన్ని ఉపయోగిస్తారు. దీని చెక్క వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉపయోగిస్తారు.అద్దకాలలో  పసుపురంగుకోసం దీని ఆకులు వినియోగిస్తారు.

శివ ధ్యాన శ్లోకాలు !....(5)

Image
శివ ధ్యాన శ్లోకాలు !....(5) "చంద్రార్థమౌళిం కాలారిం వ్యాళయజోపవీతినమ్, జ్వలత్పావకసంకాశం ధ్యాయేద్దేవం త్రిలోచనమ్." . చంద్రకళ శిరస్సునందుకలవాడును, యముని జయించినవాడును,  సర్పము యజ్ఞోపవీతముగా కలవాడును, జ్వలించుచున్న అగ్నివంటివాడును,  మూడుకన్నులు కలవాడును, అగు దేవుని ధ్యానించుచున్నాను. . దేవత: శంభువు ఋషి: కణ్వుడు . x

సైడ్ అఫ్ఫెక్ట్"

Image
సైడ్ అఫ్ఫెక్ట్"  . స్వామి శఠగోపం" వద్దకు "మెరుపు తీగ" వచ్చింది  . !! "స్వామీ!! మా ఆయన నన్ను చూస్తె అస్తమానూ విసుక్కుంటాడు ...అస్సలు ఎప్పుడూ నవ్వనె నవ్వడు...నాకు ఏదయినా "తావీజు" ఇవ్వండి స్వామీ!!" అని వేడుకుంది . !! "అవశ్యమ్!! బాలికా...ఇదిగో ఈ తావీజు నీ మేడలో కట్టుకో...మీ ఆయన నిన్ను చూసినప్పుడల్లా నవ్వుతాడు ...నిన్ను బాగా చూసుకుంటాడు!!" అన్నాడు  . "స్వామి శఠగోపం"!! ఒక వారం గడిచింది !! "మెరుపు తీగ" దిగాలు మొహం తో మళ్ళీ "స్వామి శఠగోపం" వద్దకు వచ్చింది!! "ఎం ? మా తావీజు మహిమ ఎలా వుంది??!" అని అడిగాడు "స్వామి శఠగోపం"  . "మా ఆయన సంగతేమో గానీ ...మా పక్కింట్లో 70 సం.ల ముసిలాడు , నన్ను చూసినప్పుడల్లా వెకిలిగా నవ్వుతున్నాడు!!.నాకు వొళ్ళు మండిపోతోంది ..ఎమిటి స్వామీ ఇది?? . !! "హు(!!..బాలికా !!...ప్రారబ్ధం !! ఈ మధ్యన "తావీజు" కి కూడా "సైడ్ అఫ్ఫెక్ట్" లు ఎక్కువగా ఉంటున్నాయి....కాల మహిమ !!" అన్నాడు "స్వామి శఠగోపం" !