సైడ్ అఫ్ఫెక్ట్"

సైడ్ అఫ్ఫెక్ట్" 

.

స్వామి శఠగోపం" వద్దకు "మెరుపు తీగ" వచ్చింది 

.

!! "స్వామీ!! మా ఆయన నన్ను చూస్తె అస్తమానూ విసుక్కుంటాడు ...అస్సలు ఎప్పుడూ నవ్వనె నవ్వడు...నాకు ఏదయినా "తావీజు" ఇవ్వండి స్వామీ!!" అని వేడుకుంది

.

!! "అవశ్యమ్!! బాలికా...ఇదిగో ఈ తావీజు నీ మేడలో కట్టుకో...మీ ఆయన నిన్ను చూసినప్పుడల్లా నవ్వుతాడు ...నిన్ను బాగా చూసుకుంటాడు!!" అన్నాడు 

.

"స్వామి శఠగోపం"!! ఒక వారం గడిచింది !! "మెరుపు తీగ" దిగాలు మొహం తో మళ్ళీ "స్వామి శఠగోపం" వద్దకు వచ్చింది!! "ఎం ? మా తావీజు మహిమ ఎలా వుంది??!" అని అడిగాడు "స్వామి శఠగోపం" 

.

"మా ఆయన సంగతేమో గానీ ...మా పక్కింట్లో 70 సం.ల ముసిలాడు , నన్ను చూసినప్పుడల్లా వెకిలిగా నవ్వుతున్నాడు!!.నాకు వొళ్ళు మండిపోతోంది ..ఎమిటి స్వామీ ఇది??

.

!! "హు(!!..బాలికా !!...ప్రారబ్ధం !! ఈ మధ్యన "తావీజు" కి కూడా "సైడ్ అఫ్ఫెక్ట్" లు ఎక్కువగా ఉంటున్నాయి....కాల మహిమ !!" అన్నాడు "స్వామి శఠగోపం" !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!