శివ ధ్యాన శ్లోకాలు !....(4)

.

శివ ధ్యాన శ్లోకాలు !....(4)

'సాంగ్రామికేణ వపుషా ప్రవిరాజమానం

దృప్యత్పురత్రయతృణాశని మన్దహాసమ్,

దైత్యాన్ దిధక్షు మచలేశ్వరచాపపాణిం

ధ్యాయేత్పురారి మమరౌఘరథాధిరూఢమ్."

.

యుద్ధమునకు యోగ్యమైన రూపముచే ప్రకాశించుచున్నవాడును,

గర్వించిన త్రిపురాసురులను తృణములకు పిడుగయిన చిఱునగవు గలవాడును, దైత్యులను దహింపగోరిన వాడును, మేరుపర్వతమయిన ధనస్సుచేతగలవాడును, దేవసమూహము అను రథమును ఆరోహించినవాడు అగు పురహరుడైన రుద్రుని ధ్యానించుచున్నాను.

దేవత: రుద్రుడు

ఋషి: గౌతముడు / గోధూముడు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!