శివునికి...శిరోవేష్టనంగా....జింక చర్మం..

శివునికి...శిరోవేష్టనంగా....జింక చర్మం..

.

రంగనాథుండు రంగత్తురంగ మెక్కఁ

గులిశమును దాల్చె గోత్రారి కుతుక మొప్ప;

ఖేదమోదంబు లందె నగేంద్రకన్య,

మౌళిఁ గృష్ణాజినంబున మాఁటె శివుఁడు.

.

భావం.

శత్రుసంహారానికై రంగనాథుడనే రాజు ఉద్యుక్తుడై గుఱ్ఱం ఎక్కుతున్నాడు.

ఆ ఎక్కేటప్పుడు నేలపై గుర్రం కాలిగిట్టల తాకిడి వల్ల ధూళి చెలరేగింది. 

ఆ చెలరేగిన ధూళి దుమారమై ఏకంగా సప్తసముద్రాలనూ ముంచెత్తివేసేంత ఉద్భటంగా రేగిందట.

సముద్రాలు ఇంకిపోతే — పూర్వం ఇంద్రుడు పర్వతాల రెక్కలను నరికివేసినపుడు హిమవంతుని కొడుకు మైనాకుడు తప్పించుకొని పారిపోయి సముద్రంలో దాక్కొన్నాడు కదా, అతనిప్పుడు బయటపడక తప్పదని గోత్రారి (గోత్రాలకు = పర్వతాలకు, అరి = శత్రువైనవాడు) — 

ఇంద్రుడు వజ్రాయుధాన్ని చేతబూనాడట. ఆ మైనాకుడు హిమవత్పుత్త్రిక అయిన పార్వతీదేవికి (నగేంద్రకన్యకు) తమ్ముడు కదా, ఇప్పుడిక ఇంద్రుని బారినుండి తప్పించుకోలేడని 

ఆమెకు ఖేదం కలిగింది.

.

అయితే ఒకందుకు మోదమూ కలుగకపోలేదు. సప్తసముద్రాలే ఇంకిపోగా లేనిది

తన సవతి గంగాదేవి మాత్రం ఉండగలదా? అని మోదం. 

.

గంగకు కష్టం కలిగితే పార్వతికి సంతోషమే కానీ, పాపం జగత్తులకు ఈశ్వరుడు,

గంగకు భర్త అయిన శివునికి సంతోషం ఎందుకవుతుంది? 

ఆ ఎగిరివస్తున్న దుమ్ము గంగకు సోకకుండా జింక చర్మం తీసుకొని

శిరోవేష్టనంగా తలకు చుట్టుకొన్నాడట


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!