శివ శివ శివ అనరాదా శివ నామము చేదా

ఈ గీతం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన శివక్షేత్రయాత్ర సంగీత రూపకం లోనిది.
1959లో మహాశివరాత్రినాడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంనుండి ప్రసారమయింది.
దీనికి సంగీతం కూర్చినది పాలగుమ్మి విశ్వనాథం.
గానం చేసినది మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం.
.
రాగం: మార్గహిందోళం తాళం : రూపకం (దాద్రా)
.
శివ శివ శివ అనరాదా
శివ నామము చేదా
శివపాదము మీద - నీ
శిరసునుంచరాదా
భవసాగర మీద - దు
ర్భర వేదన ఏదా ॥
.
కరుణాళుడు కాదా ప్రభు
చరణ ధూళి పడరాదా
హరహరహర అంటే మన
కరువు తీరి పోదా ॥
.
కరి పురుగు పాము బోయ
మొరలిడగా వినలేదా
కైలాసం దిగి వచ్చి
కైవల్యం ఇడలేదా
మదనాంతకు మీద - నీ
మనసెప్పుడు పోదా
మమకారపు తేరా స్వామిని
మనసారా కననీదా ॥

.


x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!