Posts

❤️🔻🌹-మన పెద్దబాలశిక్ష. పుట్టుక కధ .-🌹🔻❤️

Image
❤️🔻🌹-మన పెద్దబాలశిక్ష. పుట్టుక కధ .-🌹🔻❤️ . #నేటివుల(అప్పటి ప్రజల ) విద్యావిధానంలో లోపం ఉందని తెలుసుకుని ,.ఆనాటి మద్రాసు గవర్నరు సర్ తామస్ మన్రో 1822 జూలై రెండో తేదీన ఒక యీ దస్తు కోరారు .అందులో ఇలా వుంది : ‘రాజ్యాలను సంపాదించాక మనం భౌగోళికంగా సర్వేలు చేయించాము .దేశంలో పండే పంటల ఆరాలు తీశాము. వనరుల గురించి భోగట్టాలు రాబట్టాము.జనాభా లెక్కలు గుణించాము.అంతేగాని నేటివుల విద్యావిధానం గురించి తెలుసుకోడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.' నేటివులలో మన విశ్వాసాలకు భంగం కలగకుండా వారి విద్యావిధానంలో మార్పులను తీసుకు రావాలి అప్పటి దాకా తమ సివిల్ సర్వెంట్ల చదువు కోసమే పుస్తకాలను రాయించిన ప్రభువులు నేటివుల కోసం ప్రాథమిక గ్రంథాలను రాయించాలని అనుకొన్నారు. 1832 లో మేస్తర్ కుళులో (Clu Low) అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన #పుదూరు చదలవాడ సీతారామశాస్త్రిగారి చేత ‘బాలశిక్ష ‘అనే గ్రంథాన్ని రచింపచేశాడు. వీరి రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో వుంచుకొని గ్రంథకర్త రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది.#vva . 1856లో అంటే...

❤️-భగవద్గీత సారాంశం నారాయణుడు-❤️

Image
                                      ❤️-భగవద్గీత సారాంశం నారాయణుడు-❤️ #నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః", అంటే భగవద్గీతలో #నారాయణుడే పరమ దైవము అని చెప్పబడి ఉంది. అదేంటి మాకు నారాయణుడు గొప్ప వాడని తెలుసును , అయితే భగవద్గీతలో ఎక్కడా నారాయణుడు అనే పేరు కనిపించదు కదా అంటే నారాయణ అంటే ఏమిటి తెలియాలి, పరం బ్రహ్మ అంటే ఏమిటి తెలియాలి. సంస్కృతంలో బ్రహ్మ అంటే పెద్దది, మిగతా వాటిని తనంతట చేయునది.. మరి ఈ పరం బ్రహ్మ ఎక్కడ ఉంటాడు ? అంటే భగవద్గీత చెప్పేప్పుడు మధ్యలో తన విరాట్ రూపాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని పదకోండవ అధ్యాయంలో చూపించాడు. ఆ రూపంలో తాను అన్నింటా లోన ఉంటాడని పదవ అధ్యాయంలో చెప్పాడు. అన్నింటా బయట ఉంటా అంటే అన్నింటినీ తనలో కలిగి ఉన్నాను అనేది పదకొండవ అధ్యాయంలో చెప్పాడు. ఇలా లోన బయట ఉండేవాణ్ణి నారాయణుడు అంటారు. సంస్కృతంలో 'ర' అంటే నశించునవి. 'నర' అంటే నశించనివి. ఈ ప్రపంచంలో కనిపించేవి మార్పు చెందుతూ ఉంటాయి కానీ నశించవు. అందుకే వీటిని వస్తువు అంటాం, అంటే అవి ఎక్కడో ఎదో ఒక రూపంలో 'వసతి' ఉంటా...

❤️మరచి పోలేని మహానటుడు నూతన్ ప్రసాద్❤️

Image
  💥నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ (డిసెంబర్ 12, 1945 - మార్చి 30, 2011) అసలు పేరు తడినాధ వరప్రసాద్. 1970వ, 80వ దశకములో తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధి చెందిన హాస్య నటుడు, ప్రతినాయకుడు.. #నూతన్ ప్రసాద్ 1945, డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించాడు. బందరులో ఐటిఐ చదివిన ప్రసాద్, నాగార్జునసాగర్, హైదరాబాదులో ఉద్యోగాలు చేశాడు..#vva ఎచ్ఎఎల్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో రంగస్థల నటుడు, దరశ్శకుడైన భాను ప్రకాష్ పరిచయం అయ్యాడు. భాను ప్రకాష్ స్థాపించిన ‘కళారాధన’ సంస్థ తరపున ప్రదరర్శించిన ‘వలయం’, ‘ గాలివాన’, ‘కెరటాలు’ వంటి నాటకాలు ద్వారా నూతన్ ప్రసాద్ నాటకరంగానికి పరిచయమయ్యాడు. ఎ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో మాలపల్లి 101 సార్లు ప్రదర్శించాడు.. 1973 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంతో చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన చిత్రాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావుతో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చింది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు వచ...

🔻-వినోదయ వారి కన్యాశుల్కం చిత్రం .🔻

Image
#అభినవ ఆంధ్ర సాహితీ వైతాళికుడు, తెలుగు కథకు ఆద్యుడు గురజాడ అప్పారావు గారు (21-09-1862 & 30-11-1915)పూర్తిస్థాయి వాడుక భాషలో రాసిన తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’. ప్రపంచ నాటకాల్లో కన్యాశుల్కానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. ఒక సమకాలీన సాంఘిక సమస్యను తీసుకొని, సభ్యసమాజంలో ఎదురయ్యే సామాన్య జనం నుండి పాత్రలను తీసుకొని రాసిన నాటకమిది. ఇందులో ప్రతి పాత్ర తనదంటూ ఒక మరుపురాని హాస్యభరిత కావ్యాన్ని ఆవిష్కరించింది. బాల్యవివాహాలు, కన్యాశుల్కము వంటి సాంఘిక దురాచారాలు, హేయమైన మానవ నైజాల వంటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన నాటకం ‘కన్యాశుల్కము’. ఇంగ్లిషు, ఫ్రెంచి, రష్యన్‌, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో అనువాదానికి నోచుకున్న కన్యాశుల్కము, వివిధ నాటక సమాజాల ద్వారా కొన్ని వేల సార్లు ప్రదర్శితమైంది. #VVA  #వినోదా సంస్థ అధినేత డి.యల్‌ నారాయణ ‘కన్యాశుల్కం’ సినిమాను పి.పుల్లయ్య నిర్దేశికత్వంలో సినిమాగా నిర్మించారు. ఈ సినిమా 65 సంవత్సరాల క్రితం... అంటే 1955, ఆగస్టు 26న విడుదలైంది. తొలివిడత ‘రష్‌’లో ప్రేక్షకాదరణ లభించకపోకపోయినా తరువాతి కాలంలో విడుదలైన ప్రతిసారీ క...

🔻💥🚩అంజలీ దేవి .🚩💥🔻

Image
❤️అభినవ #సీతమ్మగా పేరొందిన అంజలీదేవి (ఆగష్టు 24, 1927 - జనవరి 13, 2014) 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి, నిర్మాత. ఆమె అసలు పేరు అంజనీ కుమారి.ఆమె నర్తకి కూడా. అంజలీ దేవి భర్త పి.ఆదినారాయణరావు.ఆమెకు ఇద్దరు కుమారులు. 1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది. ఆ తరువాత పల్లెటూరి పిల్ల, రేచుక్క, సంఘం, జయసింహ, సంతోషం, జయం మనదే, చరణదాసి, పాండురంగ మహాత్మ్యం, శోభ, రాజనందిని, బాలనాగమ్మ, రాణీ రత్నప్రభ, భట్టి విక్రమార్క, సతీ సులోచన, శాంత, భీష్మ, స్వర్ణమంజరి, లవకుశ, పరువు ప్రతిష్ట, వారసత్వం, నిర్దోషి, శ్రీ కృష్ణ తులాభారం, డాక్టర్ ఆనంద్, భలే మాస్టారు, పలనాటి యుద్ధం, బడి పంతులు,#VVA లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు సువర్ణసుందరి, అనార్కలిలో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు...

🔔గోవిందా అంటే అర్థం ఏంటో తెలుసా?🔔

Image
          🔔గోవిందా అంటే అర్థం ఏంటో తెలుసా?🔔 కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల గోవింద నామస్మరణతో సప్తగిరులు మారుమోగుతాయి. ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా.. గోవిందా అంటూ భక్తులు ఆ గోవిందుడి నామాలను స్తారు. శ్రీవారి దర్శనానికి ఎదురుచూసే భక్తుల గోవింద నామస్మరణతో ఆలయంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇంతకీ భక్తులు గోవిందుడి తలచుకోవడంలో ఆంతర్యం ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది? ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే ద్వాపర యుగం నాటి నాటి కథను తెలుసుకోవాలి. గోకులంలోని ప్రజలు ఇంద్రుడిని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే వారిని కృష్ణుడు వారిస్తాడు. తత్ఫలితంగా గోకులవాసులపై ఇంద్రుడు ఆగ్రహిస్తాడు. ఇంద్రుడు తన కోపాన్ని ప్రదర్శించి వారిపై ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. భయంకరమైన తుపాను నుంచి గోకులవాసులతోపాటు గోవులను కాపాడేందుకు గోవర్థనగిరిని తన చిటికెన వేలుతో శ్రీకృష్ణుని ఎత్తి పట్టుకుంటాడు. దీంతో ఇంద్రుడి గర్వం నశించి స్వయంగా ఆ పరంధాముని దర్శించి క్షమాపణ కోరేందుకు వెళతాడు. ఆ సమయంలో కృష్ణుని చెంతకు కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులను రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞత వ్యక్...

❤️🔻🙏🏿వినాయక జననం .🙏🏿🔻❤️

Image
                     ❤️🔻🙏🏿వినాయక జననం .🙏🏿🔻❤️ ✍🏿 కవిత -తరణికంటి సూర్యలక్ష్మి. అగడ్తల: 🐘 సీ! (1) *ఆ! పసుపు ముద్ద తోడ పార్వతి జేసెను ముద్దు లొలుకు బొమ్మ ముద్దు గొలుప ఆయు వులను బోసె అమ్మ ఆ బొమ్మకు అద్రి సుతకు బిడ్డ ఆ గణపతి! (2) *ఆ! కావ లుంచె అంబ గడప నుండ మనుచు అంత లోనె ఈశు డరుగు దెంచె ఈసు జూసి బిడ్డ ఈశ్వరు నెదురించ శివుడు వుగ్రు డగుచు శిరము దుం చె! (3) *ఆ! ఉగ్ర రూపు దాల్చి దుర్గ విజ్రం బించ ఉమను పరమ శివుడు వూరడించి గజము ఖమును దెచ్చి గణపతి మెడబెట్టె గజము ఖుడని బిలువ గ, గణపతిని! (4) *ఆ! విఘ్న నాయ కుడుగ విష్నూలు దొలగించు అవని దైవ మనగ అంబ సుతుడు కార్తి కేయు, అన్న, కాలకంఠు తన య ఎలక వాహ నంబు ఎక్కి దిరుగు! (5) *ఆ! విష్ను నాయ కుడుగ విఘ్నాలు తొలగించి విజయ సాధ నెంబు వీలు పడగ ఎల్ల జనుల కెల్ల ఎన్నోవ రములిచ్చు అభయ గణప తయ్య ఆదు కొనును! 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿