🔻💥🚩అంజలీ దేవి .🚩💥🔻



❤️అభినవ #సీతమ్మగా పేరొందిన అంజలీదేవి
(ఆగష్టు 24, 1927 - జనవరి 13, 2014)
1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి, నిర్మాత.
ఆమె అసలు పేరు అంజనీ కుమారి.ఆమె నర్తకి కూడా. అంజలీ
దేవి భర్త పి.ఆదినారాయణరావు.ఆమెకు ఇద్దరు కుమారులు.


1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది.
ఆ తరువాత పల్లెటూరి పిల్ల, రేచుక్క, సంఘం, జయసింహ, సంతోషం, జయం మనదే, చరణదాసి, పాండురంగ మహాత్మ్యం, శోభ, రాజనందిని, బాలనాగమ్మ, రాణీ రత్నప్రభ, భట్టి విక్రమార్క, సతీ సులోచన, శాంత, భీష్మ, స్వర్ణమంజరి, లవకుశ, పరువు ప్రతిష్ట, వారసత్వం, నిర్దోషి, శ్రీ కృష్ణ తులాభారం, డాక్టర్ ఆనంద్, భలే మాస్టారు, పలనాటి యుద్ధం, బడి పంతులు,#VVA

లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు
సువర్ణసుందరి, అనార్కలిలో ఆమె నటన మన్ననపొందింది.
దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. బృందావనం (1992), అన్న వదిన (1993), పోలీస్ అల్లుడు (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.

నిర్మాతగా-అంజలీ పిక్చర్స్

1953 లో తమ స్వంత బ్యానర్ పై మొదటి సినిమా పరదేశి ను నిర్మించారు. తరువాత 1955లో "అనార్కలి" చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో అంజలీదేవి అనార్కలి పాత్రను పోషించగా, అక్కినేని నాగేశ్వరరావు సలీం పాత్రను పోషించారు ఋణానుబంధం, సువర్ణ సుందరి మొదలైన చిత్రాలలో నటించారు.

ఈమె నిర్మాత కూడా. తెలుగు లోనే కాక తమిళ, కన్నడ చిత్రాలలో నటించేరు.

అంజలీ దేవి చెన్నైలో జనవరి 13, 2014 న, 86 సంవత్సరాలు వయస్సులో మృతి చెందారు
💥🚩💥🚩💥🔻💥💥🚩💥🚩💥🔻💥💥🚩💥🚩💥🔻💥

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!