🚩🚩🚩కాంతం కథలు.🚩🚩🚩


                         🚩🚩🚩కాంతం కథలు.🚩🚩🚩

✍🏿కాంతం కథలు మునిమాణిక్యం నరసింహారావు రాసిన హాస్య ప్రధానముగా సాగే కథలు. ఇవి తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి గాంచాయి.

*ఈ కథల్లో కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. పేదబడిపంతులు భార్య. భర్త అంటే ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి కురిపిస్తుంటుంది. ఆమె తన భర్తను వేళాకోళం చేస్తుంది, కించపరచదు. ఆమె అపహాస్యం వెనుక భర్త అంటే అంతులేని ఇష్టం. సగటు తెలుగు మహిళ కాంతం అని చెప్పవచ్చు.

*ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ మునిమాణిక్యాన్ని ముట్నూరి కృష్ణారావు దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేస్తుంటే ఆయన వెంటనే కాంతం భర్త కాదూ అన్నాడట. ఈ ఉదాహరణ తెలుగునాట కాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో తెలియజేస్తుంది.[

*కాంతం కథల్లో ఆయన నిజజీవితంలో జరిగిన సంభాషణలు స్ఫూర్తిగా రాసేవాడు. ఉదాహరణకు ఆయన ఓ సారి భార్యని పిలిచి నా కలం కనపట్లేదు,వెతికి పెట్టమంటే ఆవిడ వంటింట్లోనుంచి నాకు అట్లకాడ కనపడడం లేదు కాస్త వెతికిపెట్టండి అందంట.

*ఎంత కోపంలో ఉన్నా నవ్వించగల మంచి మాటకారి. మాటకుమాట ఎదుటవారు నొచ్చకోకుండా బదులు చెప్పగల నేర్పరి. ఒకరోజు భర్త, మీ చెల్లెలు ఒక కోతి మీ అక్కయ్య మరొకకోతి, తోకలు మాత్రం లేవు అని ఆటపట్టిస్తే, ఆమె తడుముకోకుండా మీ చెల్లెళ్లకు ఆ కొరతలేదని బదులు చెప్పింది. ఆమె హాస్యచతురతకు మరో ఉదాహరణ. ఎంతోసేపు కాలేదే, నాలుగైదు నిమిషాల సంభాషణలో నన్నాయన ఫూల్ అన్నాడు అని భర్త చెప్పగానే, అంత ఆలస్యం ఎందుకైందండీ అని అమాయకంగా చురక వేయటం కాంతానికే చెల్లు.

*ఇలా నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు నిత్య నూతనమనిపిస్తాయి

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!