❤️🔻🙏🏿వినాయక జననం .🙏🏿🔻❤️

                     ❤️🔻🙏🏿వినాయక జననం .🙏🏿🔻❤️



✍🏿 కవిత -తరణికంటి సూర్యలక్ష్మి.


అగడ్తల:


🐘 సీ!


(1)


*ఆ! పసుపు ముద్ద తోడ పార్వతి జేసెను


ముద్దు లొలుకు బొమ్మ ముద్దు గొలుప


ఆయు వులను బోసె అమ్మ ఆ బొమ్మకు


అద్రి సుతకు బిడ్డ ఆ గణపతి!


(2)


*ఆ! కావ లుంచె అంబ గడప నుండ మనుచు


అంత లోనె ఈశు డరుగు దెంచె


ఈసు జూసి బిడ్డ ఈశ్వరు నెదురించ


శివుడు వుగ్రు డగుచు శిరము దుం చె!


(3)


*ఆ! ఉగ్ర రూపు దాల్చి దుర్గ విజ్రం బించ


ఉమను పరమ శివుడు వూరడించి


గజము ఖమును దెచ్చి గణపతి మెడబెట్టె


గజము ఖుడని బిలువ గ, గణపతిని!


(4)


*ఆ! విఘ్న నాయ కుడుగ విష్నూలు దొలగించు


అవని దైవ మనగ అంబ సుతుడు


కార్తి కేయు, అన్న, కాలకంఠు తన య


ఎలక వాహ నంబు ఎక్కి దిరుగు!


(5)


*ఆ! విష్ను నాయ కుడుగ విఘ్నాలు తొలగించి


విజయ సాధ నెంబు వీలు పడగ


ఎల్ల జనుల కెల్ల ఎన్నోవ రములిచ్చు


అభయ గణప తయ్య ఆదు కొనును!




🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!