🔔గోవిందా అంటే అర్థం ఏంటో తెలుసా?🔔


          🔔గోవిందా అంటే అర్థం ఏంటో తెలుసా?🔔



కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల గోవింద నామస్మరణతో సప్తగిరులు మారుమోగుతాయి. ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా.. గోవిందా అంటూ భక్తులు ఆ గోవిందుడి నామాలను స్తారు. శ్రీవారి దర్శనానికి ఎదురుచూసే భక్తుల గోవింద నామస్మరణతో ఆలయంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇంతకీ భక్తులు గోవిందుడి తలచుకోవడంలో ఆంతర్యం ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది? ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే ద్వాపర యుగం నాటి నాటి కథను తెలుసుకోవాలి.




గోకులంలోని ప్రజలు ఇంద్రుడిని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే వారిని కృష్ణుడు వారిస్తాడు. తత్ఫలితంగా గోకులవాసులపై ఇంద్రుడు ఆగ్రహిస్తాడు. ఇంద్రుడు తన కోపాన్ని ప్రదర్శించి వారిపై ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. భయంకరమైన తుపాను నుంచి గోకులవాసులతోపాటు గోవులను కాపాడేందుకు గోవర్థనగిరిని తన చిటికెన వేలుతో శ్రీకృష్ణుని ఎత్తి పట్టుకుంటాడు. దీంతో ఇంద్రుడి గర్వం నశించి స్వయంగా ఆ పరంధాముని దర్శించి క్షమాపణ కోరేందుకు వెళతాడు.




ఆ సమయంలో కృష్ణుని చెంతకు కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులను రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞత వ్యక్తం చేస్తూ తన పాలతో అభిషేకించేందుకు సిద్ధమవుతుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిన ఇంద్రుడు కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా తన వాహనమైన ఐరావతాన్ని ఆజ్ఞాపిస్తాడు.




నేను కేవలం దేవతలకు మాత్రమే అధిపతిని, కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి....కాబట్టి మీరు గోవిందునిగా కూడా పిలువబడతారని ఇంద్రుడు పేర్కొంటాడు. అప్పటి నుంచే కృష్ణుడు గోవింద నామంతో పూజలందుకుంటున్నాడు.




🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!