❤️-భగవద్గీత సారాంశం నారాయణుడు-❤️

 

                                    ❤️-భగవద్గీత సారాంశం నారాయణుడు-❤️


#నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః", అంటే భగవద్గీతలో #నారాయణుడే పరమ దైవము అని చెప్పబడి ఉంది. అదేంటి మాకు నారాయణుడు గొప్ప వాడని తెలుసును

, అయితే భగవద్గీతలో ఎక్కడా నారాయణుడు అనే పేరు కనిపించదు కదా అంటే నారాయణ అంటే ఏమిటి తెలియాలి, పరం బ్రహ్మ అంటే ఏమిటి తెలియాలి.

సంస్కృతంలో బ్రహ్మ అంటే పెద్దది, మిగతా వాటిని తనంతట చేయునది.. మరి ఈ పరం బ్రహ్మ ఎక్కడ ఉంటాడు ?

అంటే భగవద్గీత చెప్పేప్పుడు మధ్యలో తన విరాట్ రూపాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని పదకోండవ అధ్యాయంలో చూపించాడు. ఆ రూపంలో తాను అన్నింటా లోన ఉంటాడని

పదవ అధ్యాయంలో చెప్పాడు.

అన్నింటా బయట ఉంటా అంటే అన్నింటినీ తనలో కలిగి ఉన్నాను అనేది పదకొండవ అధ్యాయంలో చెప్పాడు.

ఇలా లోన బయట ఉండేవాణ్ణి నారాయణుడు అంటారు. సంస్కృతంలో 'ర' అంటే నశించునవి. 'నర' అంటే నశించనివి.

ఈ ప్రపంచంలో కనిపించేవి మార్పు చెందుతూ ఉంటాయి కానీ నశించవు. అందుకే వీటిని వస్తువు అంటాం, అంటే అవి ఎక్కడో ఎదో ఒక రూపంలో 'వసతి' ఉంటాయి, కానీ నశించడం అనేది జరగదు. కాబట్టి అలాంటి వస్తువులని కలిగిన ఈ ప్రపంచాన్ని నారములు అంటారు. అవి ఆయా స్థానాల్లో ఉంటున్నాయి.

అయితే ఈ వస్తువులన్నీ స్వతంత్రముచే అలా ఉండటం లేదు. వీటిని మనం నియంత్రించటం లేదు. మరి ఎవరు వీటిని నియంత్రిస్తున్నారు ? కొంత పరిదిలో చూస్తే మనం కొన్ని వస్తువులని మార్పు చేస్తున్నాం.

కానీ భూమి, గ్రహాలు, నక్షత్రాల మాటేమిటి ? అవి ఏమైనా వాటి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాయా. వాటి కదలిక చాలా క్రమ బద్ధంగా జరుగుతుంది. వాటికి స్థితి గతులకి ఒక కారణం అనేది ఉంటుంది. మనం చూసేదాన్ని కార్యం అంటారు. ఈ కార్యాలన్నింటికీ కారణమై వాటికి ఆధారమైన వాడిని నారములకి అయనము అంటారు.

అయనం అంటే ఆధారం అని అర్థం. నార మరియూ అయన కలిపితే నారాయణ అయ్యింది.

కనిపించే ప్రతీది నారాయణ అవుతుంది. ఆ పదం అనేది

పుంలింగ శబ్దం అయ్యింది. కానీ నారాయణ అనేవాడు

"న స్త్రీ న పుంమాన్ న షండః" స్త్రీత్త్వ పుంస్త్త్వ నపుంసకత్త్వ

అనే వాటికి అతీతము నారాయణ అనే తత్త్వం. స్త్రీ, పురుష అనేవి కర్మ ప్రభావానికి లోబడినవి. నమ్మాళ్వార్ చెబుతారు, "ఆణల్లన్ పెన్నల్లన్ అల్లావలియుమల్లన్", మనం భగవంతుడు అని అయితే ఎవరిని పిలుస్తున్నామో ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు, మరొకటేదో కాదు. మరి అతడు అని ఎందుకు అనడం ? అంటే శాసించడం అనేది పుంలింగ శబ్దం. దయ అనేది స్త్రీలింగ శబ్దం. భగవంతుడు లోకాన్ని శాసించువాడు కనుక పుంలింగ శబ్దాన్ని వాడుతాం. అందుకే ఆ పదం నారాయ'ణ' అయ్యింది. అది పుంలింగ శబ్దం అయ్యింది.

నారాయణ అనే శబ్ధాన్ని మించి అర్థాన్ని ఇచ్చే పదం మరొకటి లేదు. ఆ నారాయణుడే అవతరించి కృష్ణుడై వచ్చినప్పుడు తనని ఆశ్రయించిన వారికి "మమ సాయుజ్యమాగతాః సర్గేపనోజాయతే ప్రళయేన విదంతిచ" తనతో సమానమైన స్థితిని ఇస్తాను అన్నాడు. #తనంతట చేయువాన్ని బ్రహ్మ అంటాం

కనుక నారాయణుడే పరంబ్రహ్మ. అతణ్ణి మించిన వాడు

మరొకటి లేడు. ఇది సారాంశం. అన్నింటికి బయటా ఉంటాడు, అన్నింటా లోనా ఉంటాడు. నారాయణ అనేది భగవంతుని పేరు. భగవద్గీత సారాంశం నారాయణుడు.


శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం.🙏🏿🙏🏿🙏🏿


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!