🚩నేర్చుకుందాం...‘ అతి సర్వత్ర వర్జయేత్’ “//

 



                     

          🚩నేర్చుకుందాం...‘ అతి సర్వత్ర వర్జయేత్’ “//



✍🏿“ అతిగా తిన్నా, అతిగా నిద్రించినా, అతిగా మాటాడినా, అతిగా పని చేసినా ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని పెద్దలు హెచ్చరిస్తారు”. ఇది అందరూ పాటించ వలసిన నియమం. అతి వల్ల ఎవరెవరు బాధ పడ్డారో వారిని తెలిపే సందర్భంలో పై వాక్యం చెప్పబడింది.




🔻.అతి రూపాత్ హృతా సీతా –


అతి దర్పాచ్చ రావణః


అతి దానాత్ బలిర్బద్ధః –


‘ అతి సర్వత్ర వర్జయేత్’ “🔻




వివరణ-




*“ మిక్కిలి అందంగా ఉన్నందువల్ల సీత రావణునిచే అపహరింప బడింది. “అప్సరసలను మించిన అందగత్తె సీత” అని శూర్పణఖ రావణుడితో చెపుతుంది. అందకే అపహరించి లంకకు తెస్తాడు.




**అదే రావణుడు ‘అతి గర్వం’ వల్ల నశిస్తాడు, ( నన్ను ఎవరూ జయించ లేరు అని రావణునికి గర్వం.)


*అలాగే అతి దానం వల్ల ‘బలిచక్రవర్తి’ అణచవేయ బడతాడు.” ( “వచ్చిన వాడు సాక్షాత్ విష్ణువు దానం ఇవ్వవద్దు” అని గురువు శుక్రాచార్యుడు చెప్పినా మూడడుగులు యిచ్చి, పాతాళానికి అణచి వేయబడతాడు.)


*కనుక ఏది అతిగా చేయకూడదు.అని పై శ్లోకం తెల్పుతుంది.




🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻


Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.