🔻జంటపదాల కన్నులపంట!
✍🏿తెలుగు భాషలో జంటపదాలు అనేకం ఉన్నయి
. ఇవి కొన్ని ద్వంద్వ సమాసములు.ఇల్లు వాకిలి, కట్టు బొట్టు, తోడు నీడ, పని పాట మొదలైనవి. ఇవి శుద్ధంగా ద్వంద్వ సమాసాలు అనడం కన్నా జంటపదాలు గానే పలుకుబడిలో ఉన్నాయి.ఎందుకంటే ఈ తెలుగు పదాలు సాధారణంగా వ్యప్తంగాకంటే సమస్తంగా ప్రయోగించటం విశేషం. తెలుగువాళ్ళు వీటిని జంటపదాలుగానే వాడతారు.
🚩కొన్ని జంటపదాలు!
*అంగడి-సంగడి- సంగడి అంటే స్నేహము. అంగడిన్ని స్నేహమున్ను పరస్పర సంబంధపదాలు
*అంటు-సంటు- అంటరాని వస్తువు, తత్సంబంధము. అంటు-ముట్టు అని కూడా వాడుక.
*అందం-చందం- ఊతపదాలు-చందం-అలంకరణ విధానం
*అగ్గి-బుగ్గి- బుగ్గి-బూడిద
*అచ్చట-ముచ్చట- అలంకారం-దానిపై కోరిక
*అతుకు-బొతుకు- బొత్త-పాత్రలచిల్లి-అతుకు అనేమాటతో చేరి*బొత్త, బొతుకు అయినది.
*అరి-గురి- అరి-శత్రువు, గురి-శత్రువుమీది లక్ష్యం.
*అల్లరి-చిల్లరి- చిలిపి చేష్టలు
*అల్లి-బొల్లి- బొల్లి-అబద్దం చెప్పటం. ఆటల ధోరణి
*ఆకు-అలము- అలము-శాకా విశేషము- ఆకూ అలమూ వేసి కూడ బెట్టాడు అనడం అలవాటు.
*ఆర్చు-తీర్చు- బాధతొలగించుట.
*ఆస్తి-పాస్తి- స్థిరమైన ఆస్థి-చరమైన ఆస్థి (గోడు గోద) అని అర్ధం.
*ఇచ్చు-రొచ్చు- రొచ్చు-రొంపి, సంకటము. హీన స్థితి కు సంకేతం.
*ఇరం-పరం- ఇహము పరము నుంచి వచ్చి యుండవచ్చును. లేక *ఇరుగు-పొరుగు ఇట్లా భష్టమై వుండవచ్చును.
*ఇరుగు-పొరుగు- ప్రక్కవాళ్ళు, సమీపస్థులు.
*ఇల్లు-వాకిలి- ఇల్లు తత్సంబంధమైన వాకిలి.
*ఈడు-జోడు- వయస్సుకు సంబంధించిన సమానత్వము.
**ఉడుకు-మెడుకు- ఉడుకు-పరితపించు, మెడుకు- ఎక్కువ ఉడుకుట.
ఉరుకు-పరుగు- ఉరుకులు పరుగులు-తొందర
**ఉలుకు-పలుకు- ఉలుకు-కదులుట. అదే ఉలకడు పలకడు.
*ఊపర-దాపర- ఊబ- నపుంసకుడు, దాపరీడు-దొంగ.
*ఎక్కా-ముక్కా- ఎట్లంటే అట్లు అని అర్ధం.
*ఎడ్డి-మడ్డి- ఎడ్ది-బుద్ధి హీనత.
*ఏండ్లు-పూండ్లు- పూండ్లు- అనేక సంవత్సరములు.
*ఐసా-పైసా- అతో ఇటో తేల్చి వేయుట.
*ఒడ్డు-పొడుగు- ఒడ్డు-స్థూలము, లావుపాటి.
*కొంప- గోడి/గోడు- గోణి అంటె ఎద్దు. గోణి గోడి అయినది.అదే కొంపా గోడా.
*కట్టె-కంప- కంప కూడ పెద్ద పొయ్యిలలోకి కట్టెలకి మారు పేరు.
*కత్తి-కటారు- కటారి-కత్తి లేక పెద్దబాకు.
*కధ-కమామీషు- కమామీషు-సంఘటనలు, వివరాలు.
*కలి-గంజి- కలి (తమిళం) అంబలి, గంజి-అన్నంతో కూడినవార్పు నీరు.
*కల్లి-బొల్లి- బొల్లి-ఒక చర్మరోగం. ఈ రోగం కలవాడు అబద్దాలు చెబుతాడని వాడుతారు.
*కుమ్ము-దుమ్ము- కుమ్ములాడుకోవటం.
*కూన-కురుజ- కురుజ్-చిన్నది. చిన్నవాళ్ళు అనే అర్ధం.
*కూర-నార- నార-కూరమీద పీచు.
*కూలి-నాలి- నాలి- చిన్నచూపు పని.
*కోతి-కొండముచ్చు- కొండముచ్చు- అడవిలో తిరిగే నల్లమూతి కోతి.
.*చదువు-సంధ్య
*చీకు-చింత- చీకు-నలత.
*చీము-నెత్తురు- నెత్తురు-అభిమానానికి, చీము-అవమానానికి గుర్తు.
*చిలువలు-పలువలు- చిలవ-నీరు కోడి, పలవ-చెట్టు పంగాలు. పరస్పరం సంబంధలేని విషయాలు అని అర్ధం.
*చెట్టు-చేమ- చేమ- చేమగడ్డ.
*చెత్త-చెదారం- చెదారం-తృణలేశము.
*డబ్బు-దస్కం- దస్కం- చేవ్రాలు పెట్టిన విలువైన కాగితం.
*తట్ట-బుట్ట- సర్దుకో అనిఅర్ధం.
*తల-తోక- ఆద్యంతాలు లేని అభిప్రాయం.
*తళుకు-బెళుకు- తళుకు-మిక్కిలి ప్రకాశము, బెళుకు- తళతళమని వెలుగు.
.*దిక్కు-దినాణం- ఉదా: దిక్కూ దివాణం లేనివాడవు
*దేవుడు-దెయ్యం- వ్యతిరేకార్ధాలు తెలుపునవి.
*నగ-నట్ర- ఉదా: నగ నట్ర చేయించాలి మరి!*నదురు-బెదురు- నదురు-కంటిభయం. ఎటువంటి భయంలేకపోవుట.
*నీళ్ళు-నిప్పులు- ఉదా: నీళ్ళు నిప్పులూ ఇంకా చూసుకోలే!
*నోరు-వాయి- ఉదా: నోరు వాయి లేనివాడు పాపం.
*పండగ-పబ్బం- పబ్బం-పండుగ.
*పండూ-ఫలము- ఉదా: పండూ-ఫలము-ఏదీ పుచ్చుకోడు.
*పని-పాట/పాటు- పని చెయ్యటము, చేస్తూ ఉత్సాహం కోసం పాడుకోవడం.పరువు-ప్రతిష్ఠ- పేరు-ప్రతిష్ఠ.
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
ఈ పదాలు చాలవున్నాయి. మంచి పరిచయము చేశారు.
ReplyDelete