కనుపర్తి అబ్బయామాత్యుడు!
కనుపర్తి అబ్బయామాత్యుడు! . కనుపర్తి అబ్బయామాత్యుడు 18వ శతాబ్దపు ప్రబంధకవి. ఇతడు గుంటూరు జిల్లా కనుపర్రు గ్రామంలో నివసించాడు. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. కౌండిన్య గోత్రుడు. ఇతని తండ్రి రాయన మంత్రి. తల్లి నరసమాంబ. ఇతని తాత ముత్తాతలు కొండవీటి ప్రభువుల వద్ద మంత్రులుగా పనిచేశారు. కానీ ఇతని కాలం వచ్చేసరికి కొండవీటి సామ్రాజ్యాన్ని తురుష్కులు ఆక్రమించుకున్నారు. ఇతనికి మంగళగిరి నరసింహస్వామి ఇష్టదైవము. ఇతడు రచించిన రెండు ప్రబంధాలను మంగళగిరి నృసింహస్వామికే అంకితమిచ్చాడు. ఈ కవికి సాహిత్యంలోనే కాక సంగీతము, జ్యోతిషము, సాముద్రికము, వైద్యములలో ప్రావీణ్యం వుంది . తడు వ్రాసిన రెండు ప్రబంధాలు మాత్రం లభిస్తున్నాయి. మొదటిది అనిరుద్ధ చరిత్రము. దీనిని బాల్యంలో వ్రాశాడు. రెండవ కావ్యము కవిరాజ మనోరంజనము[. దీనికే పురూరవశ్చరిత్రము అనే మరొక పేరు ఉంది. మొదటి కావ్యంతో పోల్చితే కవిరాజమనోరంజనము ప్రౌఢంగా, భావగర్భితంగా, అలంకార సహితంగా, ధారాశుద్ధి కలిగి ఉంది. ఇతని రచనలలో వీర, శృంగార రసాలను వర్ణించాడు. ఇతని శైలి మృదుపదగుంఫితమై, మిగుల ధారాళమై అలరారిస్తుంది. ఇతడు తన ప్రబంధాలలో జాతీయాలను విరివిగా వాడాడు. ఇతర ప్రబం...