"ఏది సత్యం, ఏదసత్యం, !

"ఏది సత్యం, ఏదసత్యం, 


ఏది పుణ్యం, ఏది పాపం,

ఓ మహాత్మా, ఓ మహర్షీ". 

ఏది చీకటి ఏది వెలుగు

ఏది జీవితమేది మృత్యువు

ఏది పుణ్యం ఏది పాపం

ఏది నరకం ఏది స్వర్గం

ఏది సత్యం ఏదసత్యం

ఏదనిత్యం ఏది నిత్యం

ఏది ఏకం ఏదనేకం

ఏది కారణమేది కార్యం

ఏది తెలుపు ఏది నలుపు

ఏది గానం ఏది మౌనం

ఏది నాది ఏది నీది

ఏది నీతి ఏది నేతి

నిన్న స్వప్నం నేటి సత్యం

నేటి ఖేదం రేపు రాగం

ఒకే కాంతి ఒకే శాంతి

ఓ మహాత్మా..ఓ మహర్షీ 

.

శ్రీ శ్రీ వ్రాసిన ఈ కవిత వెనుక నేపధ్యం ఇది: 

1948 జనవరి 30 న అట, మహాకవి పోనగల్ పార్క్ లో 

కూర్చొని వేరుశనక్కాయలు తింటుంటే రేడియో లో అనౌన్స్ మెంట్ వచ్చిందట మహాత్ముడు ఇక లేడు అని. 

ఆ వేరుశనక్కాయలు కట్టిన పేపర్ మీద మహాకవి 

ఈ కవిత వ్రాశారు(ట). 

ఎప్పుడో, ఎక్కడో చదివిన జ్ఞాపకం.!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!