ఛీ, ఇదేం జాతి!

ఛీ, ఇదేం జాతి!


"కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో!

కైటభదైత్యమర్దనుని గాదిలికోడల ఓ మదంబ ఓ

హాటకగర్భురాణి నినునాకటికై గొనిపోయి యల్ల క

ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ, నమ్ము భారతీ!"

.


ఇప్పుడు కర్ణాటకిరాట కీచకులు లేరు. 

అసలు రాచరికమే లేదు. ఆకలికోసం 

"బాలరసాలసాల నవపల్లవ కోమలమైన" కావ్యకన్యకని 

మనుజేశ్వరాధములకిచ్చే అవస్థ తప్పిపోయింది.

.


అయినా ఆ తల్లి కాటుకకంటినుండి కన్నీరింకా ధారగా ప్రవహిస్తూనే ఉంది.

ఎందుకమ్మా అలా ఏడుస్తావని మనసార ఓదార్చే,

మనసావాచాకర్మణా నీకు కష్టం కలిగించనమ్మా 

అని భరోసా ఇచ్చే పోతనలాంటి బిడ్డలు ఆమెకిప్పుడు కఱవయ్యారు.

ఈర్ష్య, అసూయ, స్వార్థం,ద్వేషాలతో తమలోతాము కాట్లాడుకుంటూ

ఆమె బతుకుని కుక్కలు చింపిన విస్తరి చేసే బిడ్డలు పుట్టుకొచ్చారు. ఛీ, ఇదేం జాతి!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!