ఊర్వశీ, పురూరవులు కధ!

     (పురూరవువిడిచి ఊర్వశీఇంద్రలోకానికిఏగుట ..రవి వర్మ చిత్రం )

.

ఊర్వశీ, పురూరవులు కధ!

.

కవిరాజ మనోరంజనము అనే ప్రబంధాన్ని కనుపర్తి అబ్బయామాత్యుడు క్రీ.శ.1750 ప్రాంతాలలో రచించాడు. దీనికే పురూరవశ్చరిత్రము అనే మరొక పేరు ఉంది.

.

కథాసంగ్రహం[మార్చు]

పురూరవుని సభామందిరానికి నారదుడు విచ్చేసి కొంత వేదాంతాన్ని, రాజనీతిని బోధించి అమరావతికి వెడతాడు. అక్కడ ఇంద్రునితో భూలోక విశేషాలు తెలుపుతూ ప్రసంగవశాత్తూ పురూరవుని వృత్తాంతం కొంత ముచ్చటిస్తాడు. ఇంద్రుడు పురూరవుని పూర్వవృత్తాంతం కొంచెం వివరంగా చెప్పమని నారదుని వేడుకోగా అతడు ఈ విధంగా చెప్పసాగాడు. తారాచంద్రులకు బుధుడు జన్మిస్తాడు. బుధుడికి ఇలాకన్య యందు పురూరవుడు జన్మిస్తాడు. పురూరవుడు వశిష్ఠుడిచే విద్యాభ్యాసం గావించి యుక్తవయసు రాగానే పట్టాభిషిక్తుడౌతాడు. పిమ్మట దిగ్విజయయాత్ర గావిస్తాడు. నారదుడు పురూరవుని దిగ్విజయ యాత్రను వర్ణించి చెప్పినప్పుడు అది విన్న ఊర్వశికి పురూరవునిపై వాంఛ కలుగుతుంది. మిత్రావరుణులు చేస్తున్న తపస్సును భగ్నం చేయడానికి ఊర్వశిని ఇంద్రుడు భూలోకానికి పంపుతాడు. మిత్రావరుణల చేత శాపగ్రస్త అయి ఊర్వశి పురూరవుని కలుస్తుంది. తాను మక్కువతో పెంచిన జోడు తగళ్లను తస్కరులపరహరించకూడదు, పురూరవుడు తనకు నగ్నంగా కనిపించకూడదు అనే రెండు షరతులను విధించి ఈ షరతుల భంగం కలిగితే ఇంద్రలోకానికి వెళ్లిపోతానని చెబుతుంది. ఊర్వశి గర్భధారిణియై యాయువు అనే పుత్రుని కని తన షరతులకు లోబడి ఇంద్రలోకానికి వెళ్లిపోతుంది. పురూరవుడు ఊర్వశీ వియోగానికి ఓర్వజాలక గంధర్వులను ఆశ్రయిస్తాడు. వారు ఊర్వశీ రూపముకలిగిన అగ్నిస్థాలి అనే యువతిని పురూరవునకు ఇస్తారు. పురూరవుడు ఈ మోసాన్ని కనుగొని పురంధర ప్రముఖ దేవతలను ఆశ్రయించి తిరిగి ఊర్వశిని పొందుతాడు. నర, సురలోకాలకు యధేచ్ఛగా సంచరించేందుకు వరాలను పొందుతాడు. తరువాత ఊర్వశీపురూరవులకు శ్రుతాయువు, సత్యాయువు, జయుడు, విజయుడు అనే పుత్రులు కలిగారు. వీరుగాక నరణుల యందు హవ్యవాహనుడు అనే పుత్రుడు కలుగుతాడు.

ఈ కావ్యంలో ఈకథతో పాటుగా తారాశశాంక విజయము, ఇలాకన్యకథ, ఊర్వశి పూర్వవృత్తాంతము, కుమారవన వృత్తాంతము మొదలైన ఉపకథలున్నాయి.

.

(

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!