జానపద సాహిత్యంలో సీత !
జానపద సాహిత్యంలో సీత ! (రచన: ఆచార్య పి. జ్యోతి ఈ మాట .జనవరి 2007» వ్యాసాలు). భూదేవి సీతమ్మను అత్తవారింటికి పంపుతూ బంగారు గిన్నెలో పాలు నెయ్యి పోసి సీతమ్మ చేయిముంచి వరుసగా రామునికి కౌసల్య, సుమిత్ర, కైకమ్మలకు శాంతమ్మకు అప్పగింతలు చేసింది. కౌసల్యతో వదినరో నాపుత్రి ఇదివప్పగింత పదిలంబుగా దీని బాగా చూడమ్మ పాలు కాచగ లేదు బాల మా వదినరో నెయ్యి కాచగ నేరదు నెలత సుమి మదినా నేర్పుగా చెప్పు సీత మీదమ్మా అని చెప్పింది. లోకంలో తమ కూతుళ్ళ స్వభావం ఎటువంటిదైనా తళ్ళులు వాళ్ళను వెనుకేసుకు రావడం కనిపిస్తుంది. కానీ భూదేవి అట్లాంటి తల్లికాదు. కనుకనే బుద్ధులెరుగదు మంకు బుద్ధులే గాని బుద్ధి వచ్చిన దాక దిద్దుకో వదినా అని చెప్పి “దాని పంపి నేను తాళలేనని” బాధపడింది. ఇంకా సీతమ్మతో పొద్దోయి పొరుగిళ్ళ బోకమ్మ సందలడి చాకింటి కెళ్ళబోకమ్మ వీధిలో తలకురులు విప్పబోకమ్మ పదుగురిలో పన్నెత్తి నవ్వబోకమ్మ మందిలో కన్నెత్తి చూడబోకమ్మ అని ఎన్నో సాంఘిక కట్టుబాట్లను చెప్పింది. అటువంటి కట్టుబాట్లు ఏ రకంగానైనా, ఏ సాహిత్యంలోనైనా పురుషునికి చెప్పినట్లు కనిపించదు. ఇటువంటిదే అప్పగింతలకు సంబంధించిన పాట ...