Suvarna Sundari Songs - Hayi Hayiga - ANR,Anjali Devi
.
‘సువర్ణ సుందరి’ కి షష్టి పూర్తి.!
హాయిహాయిగా ఆమని సాగే.....
1957 సంవత్సరంలో వచ్చిన ‘సువర్ణ సుందరి’ సినిమాలోని ఈ పాట గురించి ప్రముఖ కథకుడు, సంగీత విమర్శకుడు ‘భరాగో’ అన్న మాటలు గుర్తు తెచ్చుకోటం సమంజసం. “సోయగాలను విరజిమ్ముకుంటూ హాయిహాయిగా సాగిన ఈ ఆమని పాటలో కవితాస్పర్శ, ఆ మాటల పొందిక రామకృష్ణశాస్త్రిగారిని పదే పదే గుర్తుకు తెస్తుంది.(ఈ రాగమాలిక రచన సముద్రాల అని కొన్ని చోట్ల రాసారు!) ఈ సినిమా హిందీలోకి వెళ్ళినపుడు లతామంగేష్కర్, మహమ్మద్ రఫీలు ఇదే రాగాలను, ఇవే స్వరాలలో మరింత కర్ణపేయంగా ఆలపించగా, ఒక దక్షిణాత్య సినీ సంగీత దర్శకుడికి ఒక సినిమా పాట తొలిసారిగా జాతీయ స్థాయి అవార్డును సాధించి పెట్టిన సంగతిని గుర్తుంచుకొని ఆ పునాది తెలుగు పాటదే కదా అని మనం గర్వపడాలి.”
నాలుగు రాగాలు వరుసగా: సోహిని, బహార్, జోన్‌పూరి, యమన్ ఈ పాటలోని ఒక్కొక్క చరణానికి వాడుకోబడ్డాయి. పాట ఎత్తుగడ సోహినీలో ప్రారంభం అవుతుంది. చరణానికి, చరణానికి మధ్య కూడా సోహిని రాగంలోని స్వరాలతో మొదలై ఇతర రాగాల్లోకి పాట నడుస్తుంది. రెండవ చరణం ‘ఏమో తటిల్ల..’ బహార్ రాగంలోనూ, మూడవ చరణం ‘చూడుమా చందమామ..’ జోన్‌పూరిలోనూ, ఆఖరి చరణం ‘కనుగవ తనియగా… యమన్ రాగంతో పాట పూర్తి అవుతుంది.
Comments
Post a Comment