కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !
శ్రీ కృష్ణ స్తోత్రము . శ్లో !! కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ ! నాసాగ్రే నవమౌక్తికం కర తలే వేణుం కరే కంకణమ్ ! సర్వాంగే హరి చందనం చ కలియన్ కంఠే చ ముక్తావళి ! గోప స్త్రీ పరివేష్టి తో వవిజయతే గోపాల చూడామణీః !! తా. లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్న వాడును , వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించిన వాడును , ముక్కునకు బులాకీగా మంచి ముత్యమును ధరించిన వాడును , చేతుల లో వేణువు గలవాడును , చేతులకు కంకణములు ధరించిన వాడును , దేహమందతటను హరిచందనము పూయ బడిన వాడును , కంఠమునందుముత్యాల హారమును ధరించిన వాడును , గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును , అగు గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు విజయమునుపొందు గాక !!

మంచి పోస్ట్...Good
ReplyDeleteఉద్యోగ అవకాశాలు, టీచర్ గైడెన్స్, అన్ని తరగతుల ప్రశ్నా పత్రాలు, మీరు ఉన్నత స్థితికి ఎదగాలంటే ఏమి చేయాలి? తదితర విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.