మృదుపదాల మేస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి!

మృదుపదాల మేస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి!

.

పాటల లోకంలో విరిసిన పారిజాతం దేవులపల్లి. 

ఆయన 1897లో రామచంద్రపాలెంలో జన్మించినప్పట్నించీ- 

.

-''ఆకులో ఆకునై, పూవులో పూవునై, 

కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై''- 

మాటల ముత్యాలతో తెలుగు వాగ్గేయకారుల్ని మించిన

అందాల్ని తెలుగు పాటలకు అందించారు. 

.

ఆయన బ్రహ్మ సమాజవాది. 

కనిపించే ప్రతి రాయికీ, ప్రతి రప్పకీ, 

బొమ్మకీ, శిలకీ మొక్కవద్దని చాలా స్పష్టంగానే అన్నారు. 

.

''ప్రతి కోవెలకూ పరుగిడకు 

ప్రతి బొమ్మకు కైమోడ్చకు...'' 

.

ఆయన ''ప్రభు! ప్రభు! ప్రభు! దీనబంధు, ప్రాణేశ్వర దయాసింధు...'' అంటూ ఈశ్వరుడిని ఎలా వేడుకొన్నారో హైదరాబాదులో ఉన్న తరుణంలో సాయంత్రం వేళ నమాజు విని అల్లాను అలాగే వేడుకొన్నారు. 

.

ఖుదా! నీదే అదే పిలుపు 

ఖుదా! నీదే సదా గెలుపు 

.

కృష్ణశాస్త్రి ఏ విషయంమీద పాట రాసినా ప్రతి మాట లయాత్మకంగా అందులో ఒదిగి పోతుంది. 

.

''ముందు తెలిసెనా, ప్రభు ఈ 

మందిర మిటులుంచేనా...'' 

.

ఆయనొస్తాడని ముందు తెలిస్తే భక్తుడు అన్నీ సిద్ధం చేసి ఎదురు చూస్తాడు కదా... అంతే కాదు-

''ప్రతి క్షణము నీ గుణ కీర్తనము 

పారవశ్యమున చేయుదును...''

.

ఆయన్ని అందుకే వడ్డెపల్లి కృష్ణ ''మృదు పదాల మేస్త్రీ'' అన్నారు... 

లేకుంటే ఇంత కమ్మగా ఎలా సాధ్యమైంది-అంటూ గుణ నామాల్ని కీర్తిస్తూ గడపడూ! 

.

దేవులపల్లి ఒక అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వాగ్గేయకారుల సరసన నిలవదగిన గేయకారుడు.

అయితే ఆయన రచయితే కానీ పాటగాడు కాలేకపోయారు. 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!