🌹🌹🌹 "మంత్ర పుష్ప సమర్పణం🌹🌹🌹
🌹🌹🌹 "మంత్ర పుష్ప సమర్పణం🌹🌹🌹 🌹" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ "🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఏ ఉపాయం చేతనైనా , ఈశ్వరుడి అను గ్రహాన్ని సంపాదింౘవలసినఅవసరం ఉంది. దానికిగల సులభోపాయాన్ని శంకరులు ఈ శ్లోకంలో చెపుతున్నారు . ఆసులభోపాయం తెలుసుకో లోని మందబుద్ధులను ౘూసి , శంకరులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్లో" గభీరే కాసారే _ విశతి విజనే ఘోరవిపినే విశాలే శైలేచ _ భ్రమతి కుసుమార్థం జడమతిః సమర్ప్యైకం చేతః _ సరసిజ ముమానాథ! భవతే సుఖేనావస్థాతుం జన ఇహ నజానాతి కి మహో !! తాత్పర్యము: ఓ పార్వతీపతీ ! మందబుద్ధియైన మనుష్యుడు నిన్ను పూజింౘడానికి, పూవులకోసం లోతైన తటాకం లోనికి దిగుతాడు. నిర్జనమైన, భయంకరమైన అరణ్య మందూ, పెద్ద పర్వతమునందూ తిరుగుతాడు. అతడు తనలోనే వున్న తనమనస్సు అనే పద్మమును నీకు సమర్పించి,, ఈ లోకంలో సుఖంగా ఎందుకు ఉండటం లేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. మనస్సు పెట్టి భక్తితో పూజింౘడం ముఖ్యం. అంతేకానీ , పుష్ప సేకరణకైపాటు పడటం ముఖ్యం కాదని భావం. వివరణ: " మనః పుష్పమ్ సమర్పయేత్". అనగా మ